డిజిటల్ చెల్లింపులతో ఆర్థిక లావాదేవీలు సులభంగా మారాయి. క్షణాల్లో డబ్బులను నచ్చిన వారికి పంపించుకునే వెసులుబాటు లభించింది. అయితే ఇదే సమయంలో ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. మారిన టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది..
డిజిటల్ చెల్లింపుల రాకతో ఆర్థిక లావాదేవీలు సులభమయ్యాయి. ఒకప్పుడు వేరే వారికి డబ్బులు పంపించాలంటే బ్యాంకుకు వెళ్లి, క్యూ లైన్‌లో నిలబడి, వోచర్ నింపి ఓ.. పెద్ద తతంగం ఉండేది. అయితే ఇప్పుడు కాలం మారింది. ఒక క్లిక్‌తో మీ ఖాతాలోని డబ్బులు మరో ఖాతాలోకి క్షణాల్లో పంపించుకునే రోజులు వచ్చేశాయ్. అయితే కత్తికి రెండు వైపులా పదును అన్నట్లు. ఈ డిజిటల్ చెల్లింపులతో లాభాలు ఉన్నట్లే కొన్ని నస్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సైబర్ నేరస్థులు టెక్నాలజీని అడ్డం పెట్టుకొని డబ్బులు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలకు ఒక కీలక సూచన చేసింది.
తాజాగా కొత్త రకం మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓటీటీ షేర్ చేయకుండానే డబ్బు మాయం అవుతోంది. ఇందుకు ఈ మోసం ఎలా జరుగుతుంది.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? అసలు ఆర్బీఐ ఏం చెబుతోంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకీ ఏం మోసం ఎలా జరుగుతుంది.?
కొన్ని రకాల లోన్ యాప్స్ లోన్ పొందాలంటే క్కూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చెబుతుంటాయి. వాటిని స్కాన్ చేశారో మీ ఖాతాలో ఉన్న డబ్బు పోవడం ఖాయం. మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీలు మొత్తం ఇతరులకు తెలిసిపోతుంటాయి.
ఇక కొన్నిసార్లు ప్రభుత్వ బ్యాంకు పేరుతో వచ్చిన ఈమెయిల్ లేదా మెసేజ్‌లో మీ ఆధార్, పాన్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నంబర్‌ను నమోదు చేస్తే మోసగాళ్ల వలలో చిక్కుకుంటారు.
అలాగే, తెలియని నంబర్ల నుంచి వచ్చే లింక్‌లపై క్లిక్ చేయకండి. ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే పొరపాటున కూడా ఇవ్వకండి.
ఓటీపీ షేర్ చేయకపోయినా ప్రమాదం తప్పదు:
మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుకు సంబంధించిన సీవవీ, కార్డు నెంబర్ సహాయంతో కొందరు కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వీటి సహాయంతో ఓటీపీ అవసరం లేకుండానే డబ్బులు కాజేస్తారు.
ఇక కొందరు మోసగాళ్లు ఆన్‌లైన్ పేమెంట్ గేట్‌వేను ఉపయోగించి ఖాతాలోకి డబ్బు పంపుతున్నారు. ఆ డబ్బును తిరిగి ఇవ్వమని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని చెబుతున్నారు. పొరపాటున స్కాన్ చేశారో మీ ఖాతా ఖాళీ కావాల్సిందే. అందుకే తెలియని నెంబర్స్ నుంచి వచ్చే క్యూఆర్ కోడ్‌లను అస్సలు స్కాన్ చేయకూడదు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
ప్రస్తుతం ఇలాంటి సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీని షేర్ చేసుకోకూడదని చెబుతున్నారు. అలాగే డెబిట్ కార్డులను, క్రెడిట్ కార్డుల వివరాలను ఎవరితో షేర్ చేసుకోకూడదని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఓటీపీ అవసరం లేకుండా కూడా ఖాతాల్లో డబ్బులు కాజేస్తున్నారు. దీనిని బ్యాంక్ ఓటీపీ బైపాస్ స్కామ్‌గా చెబుతున్నారు. ఇటీవల ఇలాంటి మోసాలు ఎక్కువుతున్నాయి. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఓటీపీ బైపాస్ స్కామ్ ఎలా జరుగుతుంది.?
మోసగాళ్లు బ్యాంకు ఉద్యోగులుగా మాట్లాడుతూ వినియోగదారులకు కాల్ చేస్తారు. బ్యాంక్ వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ లింక్‌ను పంపుతారు. లింక్ ఓపెన్ చేసి మీ డెబిట్ కార్డ్, నెట్‌బ్యాంకింగ్ వివరాలు నింపితే, అవి నేరుగా మోసగాళ్ల వద్దకు వెళ్తాయి. ఈ సమాచారంతో మీ కార్డును ఉపయోగిస్తారు. అయతే మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని తెలుసుకునేందుకు మీ మొబైల్‌కు రిమోట్ యాక్సెస్ తీసుకుని, స్వయంగా ఓటీపీ పొందేలా చేస్తారు. సిమ్ స్వాపింగ్ ద్వారా కూడా
మరో పద్ధతిగా, వారు మీరు చెప్పిన ఓటీపీని సిమ్ స్వాపింగ్ ద్వారా తమ వద్దకు మళ్లించుకుంటారు.
