ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB)  పరిమిత కాలానికి ఇచ్చే గృహ, కారు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. గృహ రుణాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 6.75 శాతంనుండి 6.50 శాతానికి తగ్గించింది. ఇక కారు రుణాలపై సంవత్సరానికి 7.25 శాతం ఉన్న వడ్డీ రేటును 7 శాతానికి తగ్గించారు.   

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకు ఆఫ్ బరోడా(బీఓబీ) కారు లోన్లపై గుడ్‌న్యూస్ చెప్పింది. కారు లోన్ల వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించడంతో.. ఈ రేటు 7 శాతానికి దిగొచ్చింది. ఇప్పటి వరకు ఏడాదికి 7.25 శాతానికి కారు లోన్లను ఆఫర్ చేసేది బ్యాంకు ఆఫ్ బరోడా.

అయితే ఈ ఆఫర్ కేవలం పరిమితం కాలం మాత్రమేనని బ్యాంకు తెలిపింది. కారు లోన్లపై ఈ స్పెషల్ రేటు జూన్ 30,2022 వరకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. ఈ పరిమితి కాలంలో కొత్త కారు కొనే కస్టమర్లకు ఈ వడ్డీ రేటును బ్యాంకు ఆఫర్ చేస్తుంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటోన్న వారు ఈ ఆఫర్‌ను అందిపుచ్చుకోవచ్చని పేర్కొంది. అయితే సెకండ్ హ్యాండ్ కార్లు, టూవీలర్ లోన్లపై మాత్రం వడ్డీ రేట్లను బ్యాంకు మార్చలేదు.

కారు లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించడమే కాదు, లోన్ ప్రాసెసింగ్ ఫీజులను కూడా బ్యాంకు తగ్గించింది. జూన్ 30 వరకులోన్ ప్రాసెసింగ్ ఛార్జీలను రూ.1,500కు(జీఎస్టీతో కలుపుకుని) తగ్గిస్తున్నట్టు పేర్కొంది. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఈ వడ్డీ రేట్లు కస్టమర్ల ‘క్రెడిట్ ప్రొఫైల్’తో లింక్ అయి ఉంటాయి. కారు లోన్లపై తగ్గించిన వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులతో.. ప్రస్తుతం కస్టమర్లు మరింత అఫర్డబుల్‌లో తమకు నచ్చిన కారును కొనుగోలు చేసేలా చేశామని బ్యాంకు జనరల్ మేనేజర్(మోర్టగేజ్, ఇతర రిటైల్ అసెట్స్) హెచ్‌టీ సోలంకి చెప్పారు.

బ్యాంకు ఆఫ్ బరోడా ఇటీవల హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించి, సొంతిళ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త చెప్పింది. బ్యాంకు ప్రస్తుతం హోమ్ లోన్లను 6.5 శాతానికే ఆఫర్ చేస్తోంది. అంతకుముందు ఈ రేటు ఏడాదికి 6.75 శాతంగా ఉండేది. కొత్త రేటును ఏప్రిల్ 22 నుంచే అమల్లోకి తెచ్చింది. అంతేకాక హోమ్ లోన్లపై ఈ ప్రత్యేక రేటును జూన్ 30, 2022 వరకు ఆఫర్ చేస్తుంది. 

భవిష్యత్ లో రుణాలపై వడ్డీ రేట్లు మరింతగా పెరిగే అవకాశం కన్పిస్తుంది.  ప్రస్తుతం రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతుంది. ఎన్నడూ లేని విధంగా 6.95 శాతానికి చేరింది. మరోవైపు జూన్‌లో ఆర్‌బీఐ రెపో రేటు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే అన్ని రకాల రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. దీంతో వ్యక్తి గత, వాహన, గృహ రుణాలపై వడ్డీ  మరింతగా పెరుగుతుంది.