జనవరిలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్..

కొత్త సంవత్సరానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ సందర్భంలో, జనవరి 2024 నెలలో మొత్తం 16 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
 

Bank Holidays: Total 16 days bank holiday in month of January The RBI holiday list is as follows-sak

ప్రతి నెల ప్రారంభానికి ముందు RBI బ్యాంకు హాలిడేస్ లిస్ట్ విడుదల చేస్తుంది. దీని ప్రకారం, డిసెంబర్ నెల ముగియడానికి కొద్దీ రోజులు మాత్రమే మిగిలి ఉంది. దింతో జనవరి నెల  హాలిడేస్ లిస్ట్ ను RBI ప్రకటించింది. రిపబ్లిక్ డేతో సహా కొత్త సంవత్సరం (2024) మొదటి నెలలో బ్యాంకులకు మొత్తం 16 రోజులు సెలవులు రానున్నాయి. ప్రజలు ఇప్పటికే 2024 కోసం ఆర్థిక ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఒకవేళ మీరు 2024లో ఏదైనా బ్యాంకు సంబంధిత లేదా ఇల్లు లేదా కారు కొనాలని ప్లాన్ చేస్తే బ్యాంక్ లోన్ పొందడానికి మీరు జనవరిలో బ్యాంక్‌ని సందర్శించాల్సి రావచ్చు. కాబట్టి జనవరి హాలిడే షెడ్యూల్ చూసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.

ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం ఈ సెలవులు ఉంటాయి. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ అండ్ గెజిటెడ్ సెలవులు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు అన్ని ఆదివారాలు, రెండవ ఇంకా  నాల్గవ శనివారాలు సెలవులు. సెలవు రోజుల్లో ఆన్‌లైన్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే, బ్యాంకుకు వెళ్లే  ముందు  హాలిడేస్ లిస్ట్ చెక్ చేయడం మంచిది.

బ్యాంక్ హాలిడేస్ RBI మూడు వర్గాలుగా విభజించింది. RBI హాలిడేస్ లిస్ట్ లోని సెలవులు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఇంకా  ప్రాంతీయ బ్యాంకులకు వర్తిస్తాయి.

జనవరి హాలిడేస్
1: కొత్త సంవత్సరం మొదటి రోజు 

జనవరి 7: ఆదివారం

జనవరి 11: మిషనరీ డే (మిజోరం)

జనవరి 12: స్వామి వివేకానంద జయంతి (పశ్చిమ బెంగాల్)

జనవరి 13: రెండవ శనివారం

జనవరి 14: ఆదివారం, భోగి

జనవరి 15 : సంక్రాంతి / తిరువళ్లూరు డే (తమిళనాడు ఇంకా ఆంధ్రప్రదేశ్)

జనవరి 16: తుసు పూజ, కనుమ (పశ్చిమ బెంగాల్ అండ్ అస్సాం)

జనవరి 17: గురు గోవింద్ సింగ్ జయంతి 

జనవరి 21: ఆదివారం

జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

జనవరి 25: రాష్ట్ర దినోత్సవం (హిమాచల్ ప్రదేశ్ )

జనవరి 26: గణతంత్ర దినోత్సవం 

జనవరి 27: నాల్గవ శనివారం

జనవరి 28: ఆదివారం

జనవరి 31 : Mi-Dam-Mi-Fi (అస్సాం)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios