Bank Holidays September 2023: సెప్టెంబరులో బ్యాంకు సెలవుల లిస్టు ఇదే..మీ బ్యాంకు పనులు ముందే ప్లాన్ చేసుకోండి

సెప్టెంబర్ నెలలో ఆర్బిఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం మొత్తం 16 రోజులు బ్యాంకులు పనిచేయడం లేదు. అయితే ఈ సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటాయి. కాగా మీరు కనుక ఆయా బ్యాంకుల్లో పనులు ఉన్నట్లయితే, సెలవుల జాబితాను బట్టి మీ పనులను ప్లాన్ చేసుకోండి.

Bank Holidays September 2023 This is the list of bank holidays in September Plan your bank work in advance MKA

మరో వారం రోజుల్లో ఆగస్ట్ నెల గడిచిపోయి.  కొత్త నెల సెప్టెంబర్ రాబోతోంది.  ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెప్టెంబర్ 2023 కోసం బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా ప్రకారం, రెండవ,  నాల్గవ శని,  ఆదివారాలతో సహా దేశంలోని వివిధ ప్రాంతాలలో 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. 

RBI మార్గదర్శకాల ప్రకారం, అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు రాష్ట్ర ప్రత్యేక ప్రాతిపదికన కొన్ని ప్రాంతీయ సెలవులతో మూసివేస్తారు. ప్రాంతీయ సెలవులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. దులో, శ్రీ కృష్ణ జన్మాష్టమి (సెప్టెంబర్ 19), ఈద్-ఎ-మిలాద్ (సెప్టెంబర్ 28) వంటి ఇతర సెలవులు కూడా వస్తాయి, ఆ రోజు దేశంలోని అన్ని బ్యాంకులు మూసివేస్తారు.

సెప్టెంబరులో బ్యాంకులు ఏ రోజుల్లో మూసివేసి ఉంటాయో పూర్తి లిస్టు చూద్దాం..

3 సెప్టెంబర్ 2023: ఆదివారం
6 సెప్టెంబర్ 2023: శ్రీ కృష్ణ జన్మాష్టమి
7 సెప్టెంబర్ 2023: జన్మాష్టమి 
9 సెప్టెంబర్ 2023: రెండవ శనివారం
10 సెప్టెంబర్ 2023: రెండవ ఆదివారం
17 సెప్టెంబర్ 2023: ఆదివారం
18 సెప్టెంబర్ 2023: వర సిద్ధి వినాయక వ్రతం / వినాయక చతుర్థి
19 సెప్టెంబర్ 2023: గణేష్ చతుర్థి / సంవత్సరం (చతుర్థి పక్షం)
20 సెప్టెంబర్ 2023: గణేష్ చతుర్థి (రెండో రోజు) / నుఖాయ్
22 సెప్టెంబర్ 2023: శ్రీ నారాయణ గురు సమాధి దినం (కేరళలో బ్యాంకులకు సెలవు)
23 సెప్టెంబర్ 2023: నాల్గవ శనివారం మహారాజా హరి సింగ్ పుట్టినరోజు
24 సెప్టెంబర్ 2023: ఆదివారం
25 సెప్టెంబర్ 2023: శ్రీమంత్ శంకర్‌దేవ్ పుట్టిన రోజు
27 సెప్టెంబర్ 2023: మిలాద్-ఎ-షెరీఫ్ 
28 సెప్టెంబర్ 2023: ఈద్-ఎ-మిలాద్ / ఈద్-ఎ-మిలాదున్నబి 
29 సెప్టెంబర్ 2023: ఈద్-ఎ-మిలాద్-ఉల్-నబీ 

RBI అధికారిక వెబ్‌సైట్‌లోని ఈ లింక్ బ్యాంక్‌లోని ఈ బ్యాంక్ సెలవుదినం వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు, పండుగలు లేదా ఆ రాష్ట్రాల్లోని ఇతర ఈవెంట్‌లపై ఆధారపడి ఉంటుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios