ఆ Holidays అన్ని రాష్ట్రాలకు వర్తించవు. state ని బట్టి మారుతూ ఉంటాయి. కన్నడ రాజ్యజోత్సవం, ఛత్ పూజ వంటి స్థానిక పండుగ రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో Banks పనిచేయవు ఆ విధంగా బ్యాంకులకు నవంబర్లో 17 సెలవులు ఉండనున్నాయి.
నవంబర్ లో బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఆర్బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు కలుపుకుని మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఇది.
దీంతో బ్యాంకు పనులు పెట్టుకున్న వారిలో ఆందోళన మొదలయ్యింది. అయ్యో.. వచ్చే నెలలో చాలా బ్యాంకు పనులు పెట్టుకున్నానే.. ఇన్ని సెలవులా అంటూ కంగారు పడిపోతున్నారు. అయితే, కంగారు వద్దు.. ఎందుకంటే ఆ Holidays అన్ని రాష్ట్రాలకు వర్తించవు.
state ని బట్టి మారుతూ ఉంటాయి. కన్నడ రాజ్యజోత్సవం, ఛత్ పూజ వంటి స్థానిక పండుగ రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో Banks
పనిచేయవు ఆ విధంగా బ్యాంకులకు నవంబర్లో 17 సెలవులు ఉండనున్నాయి.
కానీ Social mediaల్లో ఏకంగా 17 రోజులపాటు బ్యాంకులు పనిచేయవు అన్న ప్రచారం జరుగుతోంది. దీంట్లో ఎలాంటి నిజం లేదు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దీపావళి, గురునానక్ జయంతి/ కార్తీక పూర్ణిమ సందర్భంగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి.
సాధారణ సెలవుల(శని, ఆదివారాలు)తో కలుపుకుని మొత్తం ఎనిమిది రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి ఆయా తేదీలను బట్టి మీ బ్యాంకు పనులను షెడ్యూల్ చేసుకోండి..
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులివే..
నవంబర్ 4 దీపావళి (గురువారం)
నవంబర్ 7 (ఆదివారం)
నవంబర్ 13 (రెండో శనివారం)
నవంబర్ 14 (ఆదివారం)
నవంబర్ 19 గురునానక్ జయంతి కార్తీక పౌర్ణమి (శుక్రవారం)
నవంబర్ 21 (ఆదివారం)
నవంబర్ 27 (నాలుగో శనివారం)
నవంబర్ 28 (ఆదివారం)
