ఫిబ్రవరిలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి.  ఫిబ్రవరిలోని సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి.

ఫిబ్రవరిలో 12 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటాయి. ఫిబ్రవరిలోని సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు కూడా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో, బసంత్ పంచమి, గురు రవిదాస్ జయంతి నాడు బ్యాంకులకు సెలవు ఉంటుంది. అయితే, ఫిబ్రవరి నెలలో దేశంలోని ప్రతిచోటా బ్యాంకులు 12 రోజులు మూసివేయరు. వివిధ రాష్ట్రాలకు వేర్వేరు సెలవులు ఉంటాయి. ఫిబ్రవరి నెలలో వచ్చే కొన్ని పండుగలు నిర్దిష్ట రాష్ట్రం లేదా ప్రాంతానికి సంబంధించినవి. అందువల్ల.. బ్యాంకు సెలవులు రాష్ట్రాల నుండి రాష్ట్రానికి మారవచ్చు. ఇవేకాకుండా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం మరికొన్ని బ్యాంకు సెలవులు ఉంటాయి. మీరు సెలవుల జాబితాను చూసిన తర్వాత మాత్రమే బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి బ్యాంక్‌​ సెలవుల జాబితా (Bank Holidays list)

ఫిబ్రవరి 2: సోనమ్ లోచర్​ (గ్యాంగ్​టాక్​లో బ్యాకులలకు వర్తిస్తుంది)
ఫిబ్రవరి 5: సరస్వతి పూజా, శ్రీ పంచమి, వసంత పంచమి (కోల్​కతా, భువనేశ్వర్​, అగర్తలకు వర్తింపు)
ఫిబ్రవరి 6: ఆదివారం సాధారణ సెలవు
ఫిబ్రవరి 12: రెండో శనివారం సాధారణ సెలవు
ఫిబ్రవరి 13: ఆదివారం సాధారణ సెలవు
ఫిబ్రవరి 15: మహమ్మద్ హజ్రత్ అలీ జయంతి, లుయిస్​-నాగాయ్​-ని (ఇంఫల్​, కాన్​పూర్​, లక్నోల్లో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 16: గురు రవిదాస్​ జయంతి (చంఢీగడ్​లో బ్యాంకులకు వర్తింపు)
ఫిబ్రవరి 18: దోల్​జాత్రా​ (కోల్​కతాలో బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్​ జయంతి (మహారాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
ఫిబ్రవరి 20: ఆదివారం సాధారణ సెలవు
ఫిబ్రవరి 26: నాలుగో శనివారం సాధారణ సెలవు
ఫిబ్రవరి 27: ఆదివారం సాధారణ సెలవు