ప్రతి నెలా ప్రారంభానికి ముందు బ్యాంకు హాలిడేస్ లిస్ట్ ఆర్‌బి‌ఐ విడుదల చేస్తుంది. దీని ప్రకారం మార్చ్ నెల బ్యాంకు సెలవుల జాబితాను కూడా ఆర్బీఐ విడుదల చేసింది. మార్చి నెలలో ఉగాది, హోలీ ఇంకా శ్రీరామ నవమితో సహా మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవు రానుంది. 

న్యూఢిల్లీ : ఫిబ్రవరి నెల ముగియడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రతి కొత్త నెల ప్రారంభానికి ముందు RBI బ్యాంకులకు సంబంధిత హాలిడేస్ లిస్ట్ విడుదల చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే మార్చి నెల హాలిడేస్ లిస్ట్ కూడా విడుదలైంది. మార్చి నెలలో ఉగాది, హోలీ ఇంకా శ్రీరామ నవమితో సహా మొత్తం 12 రోజులు బ్యాంకులకు సెలవు రానుంది. ఇప్పుడు RBI సెలవుల లిస్ట్ లో అన్ని సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండుగల ప్రకారం సెలవులు ఇవ్వబడతాయి.

అయితే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు పబ్లిక్ అండ్ గెజిటెడ్ సెలవులు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆదివారాలు, రెండవ ఇంకా నాల్గవ శనివారాలు సెలవులు ఉంటాయి. మీకు మార్చి నెలలో బ్యాంక్ సంబంధించి ఏదైనా పని ఉంటే, RBI సెలవుల లిస్ట్ చెక్ చేయడం మంచిది.

బ్యాంకులకు సెలవులను ఆర్‌బీఐ మూడు కేటగిరీలుగా విభజించింది. 1.నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవులు, 2.నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్-టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సెలవులు 3.అక్కౌంట్స్ క్లోసింగ్ సెలవులు. RBI హాలిడేస్ లిస్ట్ లోని సెలవులు ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ, విదేశీ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఇంకా ప్రాంతీయ బ్యాంకులకు వర్తిస్తాయి. 

బ్యాంకు సెలవుల సమయంలో ఆన్‌లైన్ లావాదేవీలు ఇంకా ATM లావాదేవీలు ఎప్పటిలాగే కొనసాగుతాయి.

మార్చి నెల హాలిడేస్ లిస్ట్ :
మార్చి 3: ఛప్చార్ కూట్ (మిజోరం)
మార్చి 5: ఆదివారం
మార్చి 7: హోలీ/హోలీ కా దహన్/ధులండి/డోల్ జాత్రా (మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్, శ్రీనగర్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరం ప్రదేశ్, జమ్మూ, శ్రీనగర్, తెలంగాణ అండ్ జార్ఖండ్)
మార్చి 8: హోలీ/ధూలేతి రెండవ రోజు/యోసాంగ్ రెండవ రోజు (త్రిపుర, గుజరాత్, మిజోరం, మధ్యప్రదేశ్, ఒడిశా, చండీగఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, జమ్మూ, ఉత్తరప్రదేశ్, బెంగాల్ , ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, మేఘాలయ అండ్ హిమాచల్ ప్రదేశ్)
మార్చి 9: హోలీ (బీహార్)
మార్చి 11: రెండవ శనివారం
మార్చి 12: ఆదివారం
 మార్చి 19: ఆదివారం
మార్చి 22: గుడి పడ్వా/ఉగాది/బీహార్ దివస్/సాజిబు నొంగ్మపంబ ( చైరోబా)/తెలుగు నూతన సంవత్సర దినోత్సవం/ మొదటి నవరాత్రి (మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మణిపూర్, జమ్ము, గోవా అండ్ బీహార్)
మార్చి 25: నాలుగో శనివారం
మార్చి 26: ఆదివారం
మార్చి 30: శ్రీరామ నవమి (గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, సిక్కిం, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ మరియు సిమ్లా)