డిడి చేయడానికి, డబ్బు డిపాజిట్ చేయడానికి, విత్‌డ్రా చేయడానికి, ఏటిఎం కార్డు పొందడానికి, రుణం తీసుకోవడానికి ప్రజలు బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయో, ఏ రోజు మూసివేసి ఉంటుందో చాలా సార్లు తెలుసుకోలేకపోతుంటాము.
ఏదైనా పని చేసే ముందు మనము ఎలా చేయాలి అని ముందుగానే ప్లాన్ చేస్తుంటాము. ఇంటి పనుల కోసమో, మరేదైనా పని కోసమో ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతుంటం. సాధారణంగా ఏదైనా ఆర్ధిక లావాదేవి కోసం ప్రజలు ఎక్కువగా వెళ్ళేది బ్యాంకుకి. డిడి చేయడానికి, డబ్బు డిపాజిట్ చేయడానికి, విత్‌డ్రా చేయడానికి, ఏటిఎం కార్డు పొందడానికి, రుణం తీసుకోవడానికి ప్రజలు బ్యాంకులకు వెళ్తుంటారు. అయితే బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయో, ఏ రోజు మూసివేసి ఉంటుందో చాలా సార్లు తెలుసుకోలేకపోతుంటాము. అందుకే 2022 మార్చి నెల సెలవుల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన జాబితా గురించి తెలుసుకుందాం...
మార్చి 1
మహాశివరాత్రి మార్చి 1న రానుంది, ఈ కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పంజాబ్, కర్ణాటక, కేరళతో సహా చాలా రాష్ట్రాల్లో బ్యాంకు ఉద్యోగులకు సెలవు ఉంటుంది. దీంతో ఈ ప్రదేశాలలో బ్యాంకులు మూసివేయబడతాయి. అయితే, ఐజ్వాల్, ఇంఫాల్, చెన్నై, గ్యాంగ్‌టక్, గౌహతి, అగర్తల, కోల్‌కతా, న్యూఢిల్లీ, పనాజీ, పాట్నా, షిల్లాంగ్‌లలో ఈ సెలవు ఉండదు.
మార్చి 3
లోసార్ కారణంగా గాంగ్‌టక్‌లో ఈ రోజు బ్యాంకులకు సెలవు.
మార్చి 4
చాప్‌చార్ కుట్ కారణంగా ఐజ్వాల్‌లో మార్చి 4న బ్యాంకులు మూసివేయబడతాయి.
మార్చి 6
ఈ రోజు ఆదివారం కావడంతో దేశంలో అన్నీ బ్యాంకులు మూసి ఉంటాయి.
12-13 మార్చి
మార్చి నెలలో ఈ రెండు రోజుల్లో రెండవ శనివారం ఇంకా ఆదివారం రానుంది. దీంతో ఈ రెండు రోజుల్లో కూడా బ్యాంకులకు సెలవు ఉంటుంది.
మార్చి 17-18
కాన్పూర్, డెహ్రాడూన్, రాంచీ, లక్నోలలో హోలికా దహన్ కారణంగా మార్చి 17న బ్యాంకులకు సెలవు ఉంటుంది. మార్చి 18 న దేశవ్యాప్తంగా హోలీ ఆడతారు. దీంతో ఈ రోజు కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
మార్చి 19-20
హోలీ లేదా ఒసాంగ్ కారణంగా మార్చి 19న పాట్నా, భువనేశ్వర్, ఇంఫాల్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి. ఆదివారం కారణంగా మార్చి 20న బ్యాంకులు మూసివేయబడతాయి.
మార్చి 22
ఈ రోజు బీహార్‌లో బ్యాంకులు మూసివేయబడతాయి, ఎందుకంటే ఈ రోజున బీహార్ దినోత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటారు.
26-27 మార్చి
మార్చి 26న నాలుగో శనివారం, 27న ఆదివారం సెలవు రానుంది. దీంతో ఈ రెండు రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి.
