దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులకు నేషనల్ హాలిడేస్ రానుండగా మరికొన్ని బ్యాంకులకు స్థానిక సెలవులు ఉన్నాయి. ఈ  కారణంగా వివిధ రాష్ట్రాల్లో చాలా బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. 

న్యూఢిల్లీ: ఈ సంవత్సరం డిసెంబర్ నెలతో ముగియనుంది. ఆయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ 2022 హాలిడేస్ లిస్ట్ ప్రకారం, ఆన్‌లైన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు పని చేస్తూన్నప్పటికీ డిసెంబర్ నెలలో కొన్ని రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి, మీరు ఈ నెలలో బ్యాంకుకి సంబంధిత ఏదైనా ముఖ్యమైన పని కోసం మీ బ్యాంక్ బ్రాంచ్‌ వెళ్లాలనుకుంటే, డిసెంబర్ 2022 నెలలో ఇండియాలోని అన్నీ నగరాల్లో బ్యాంకులు బంద్ కానున్న రోజులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులకు నేషనల్ హాలిడేస్ రానుండగా మరికొన్ని బ్యాంకులకు స్థానిక సెలవులు ఉన్నాయి. ఈ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చాలా బ్యాంకు శాఖలు మూతపడనున్నాయి. డిసెంబరు నెలలో మీ బ్యాంక్ బ్రాంచ్‌ని సందర్శించే ముందు, బ్యాంకులు మూసివేయబడే ముఖ్యమైన రోజుల లిస్ట్ తప్పనిసరిగా తెలుసుకోవాలి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడేస్ క్యాలెండర్ లిస్ట్ ప్రకారం డిసెంబర్ నెలలో మొత్తం 14 రోజులు బ్యాంకులు మూసివేయబడతాయి. ఇందులో వీకెండ్ హాలిడేస్ కూడా ఉన్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని బ్యాంకులు బంద్ కానున్న రోజులు.... 

డిసెంబర్ 2022 బ్యాంక్ హాలిడేస్ లిస్ట్ 

సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్: డిసెంబర్ 3

పా-టోగన్ నెంగ్మింజా సంగ్మా: డిసెంబర్ 12

గోవా లిబరేషన్డే: డిసెంబర్ 19

క్రిస్మస్ ఫెస్టివల్: డిసెంబర్ 24

క్రిస్మస్ సెలెబ్రేషన్/లోసూంగ్/నామ్‌సూంగ్: డిసెంబర్ 26

గురు గోవింద్ సింగ్ జీ పుట్టినరోజు: డిసెంబర్ 29

యు కియాంగ్ నంగ్‌బా: 30

న్యూ ఇయర్ వేడుక: డిసెంబర్ 31

పై బ్యాంకు సెలవులు కాకుండా రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు ఈ తేదీలల..:

ఆదివారం: డిసెంబర్ 4

రెండవ శనివారం: డిసెంబర్ 10

ఆదివారం: డిసెంబర్ 11

ఆదివారం: డిసెంబర్ 18

నాల్గవ శనివారం: డిసెంబర్ 24

ఆదివారం: డిసెంబర్ 25

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హాలిడేస్ మూడు బ్రాకెట్ల క్రింద ఉంచుతుంది - హాలిడే ఆండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ; హాలిడే ఆండర్ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే; బ్యాంక్ అక్కౌంట్స్ క్లోసింగ్. అయితే, బ్యాంకు సెలవులు వివిధ రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి అలాగే అన్ని బ్యాంకులు తప్పనిసరి పాటించవు. బ్యాంక్ హాలిడే రాష్ట్రాలలో జరుపుకునే పండుగలు లేదా ఆ రాష్ట్రాల్లోని సందర్భాల పై కూడా ఆధారపడి ఉంటాయి.