సారాంశం

Bajaj GoGo EV: బజాబ్ కంపెనీ సూపర్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఆటోని విడుదల చేసింది. ఇప్పటికే బజాజ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా మరింత మార్కెట్ సంపాదించడానికి బజాబ్ ప్రయత్నిస్తోంది. ఈ త్రీ వీలర్ ఫీచర్లు తెలుసుకుందామా? 

ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు బజాజ్ కంపెనీ గోగో పేరుతో కొత్త త్రీ వీలర్ ఆటోను ప్రవేశపెట్టింది. మూడు వెర్షన్‌లలో టెక్ లోడెడ్ ప్యాసింజర్ ఆటోలు విడుదల చేసింది. అవి P5009, P5012, P7012. ఇందులో టాప్ మోడల్ ధర రూ. 3,83,004 (ఎక్స్-షోరూమ్), బేస్ మోడల్ ధర రూ.3.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో ఫీచర్లు

ఈ ఆటోల్లో డిజిటల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, USB టైప్ A సపోర్ట్ సిస్టమ్‌తో మొబైల్ ఛార్జర్, గ్లోవ్ బాక్స్, టెలిమాటిక్స్ ఇంటిగ్రేషన్, ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక భాగం కోసం హెలికల్ కాయిల్ స్ప్రింగ్‌తో స్వింగ్ ఆర్మ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి కేవలం రూ.50 వేల నుంచే అదిరిపోయే ఫీచర్స్‌తో ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఈ ఆటోల్లో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆటో హజార్డ్, యాంటీ రోల్ డిటెక్షన్‌ను స్టాండర్డ్‌గా అందించిన మొదటి వాహనం బజాజ్ గోగో. ఈ ఆటోలకు ఎల్ఈడీ లైటింగ్, హిల్ హోల్డ్ అసిస్ట్, 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఉన్నాయి. 

బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో బ్యాటరీ, రేంజ్

బజాజ్ కంపెనీ అందించిన వివరాల ప్రకారం తక్కువ ట్రిమ్ అయిన P5009, 4.5 kW గరిష్ట శక్తిని, 36 Nm గరిష్ట టార్క్‌ను అందించగల అధునాతన PMS మోటార్‌ను కలిగి ఉంది. అయితే టాప్ వేరియంట్‌లైన P5012, P7012 మోడల్స్ 5.5 kW వరకు శక్తిని, 36 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలవు.

P5009 మోడల్ ఒకసారి ఛార్జ్‌ చేస్తే 171 కి.మీ. రేంజ్‌ను వరకు ప్రయాణించగలదు. మిగిలిన రెండు మోడల్స్ మాక్సిమం 251 కి.మీ. వరకు ప్రయాణిస్తాయి. ఛార్జింగ్ సమయం విషయానికొస్తే, P5009 0% నుండి 80% బ్యాటరీ సామర్థ్యాన్ని పొందడానికి కేవలం 4.30 గంటలు మాత్రమే పడుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ ఛార్జర్‌తో వస్తుంది కాబట్టి కస్టమర్‌లు దీన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.

ఇది కూడా చదవండి రూ.లక్ష లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: ఒక్క ఛార్జ్ కే 176 కి.మీ రేంజ్

బజాజ్ గోగో ఎలక్ట్రిక్ ఆటో ధర

టాప్ మోడల్ ధర రూ. 3,83,004 (ఎక్స్-షోరూమ్), బేస్ మోడల్ ధర రూ.3.26 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అదనంగా రూ. 3,200 చెల్లిస్తే పార్క్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్టెన్స్, యాంటీ థెఫ్ట్ వార్నింగ్ వంటి కొన్ని అధునాతన ఫీచర్లను కూడా పొందవచ్చు. ఈ ఎలక్ట్రిక్ ఆటో కొనాలంటే డౌన్ పేమెంట్ రూ. 24,999 కడితే సరిపోతుంది.