Electric Scooters: రూ.లక్ష లోపు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు: ఒక్క ఛార్జ్ కే 176 కి.మీ రేంజ్
Electric Scooters: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ బాగా పెరిగిపోతోంది. పెట్రోల్ రేట్లు మండిపోవడం, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు చూస్తున్నారు. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తుంటే, ఒక్కసారి ఛార్జ్ చేస్తే మంచి రేంజ్ వచ్చేలా ఉండాలనుకుంటే, 2025 మార్చిలో అందుబాటులో ఉన్న బెస్ట్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఓలా ఎలక్ట్రిక్, హీరో విడా, హోండా, బిగాయస్, ఓకయా వంటి చాలా కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటి ధర లక్ష రూపాయల లోపే ఉంటుంది. ఇవి సింగిల్ ఛార్జ్‌తో 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు వెళతాయి. లుక్స్, ఫీచర్స్, సేఫ్టీ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు మీ అంచనాలకు తగ్గట్టు ఉంటాయి. ఇంకా ఈ స్కూటర్లు ప్రతి నెల పెట్రోల్ ఖర్చుతో వేల రూపాయలు ఆదా చేస్తాయి. పర్యావరణానికి కూడా మంచిది. బెస్ట్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ బడ్జెట్, ఎక్కువ మంది ఫేవరేట్ స్కూటర్ కావాలంటే ఓలా ఎస్1ని మీరు కొనుక్కోండి.
మోడల్: S1
టాప్ స్పీడ్: గంటకు 101 కి.మీ
బ్యాటరీ రేంజ్: ఒక ఛార్జ్‌పై 108 కి.మీ
ఎక్స్-షోరూమ్ ధర: రూ.74,999
మోడల్: S1
టాప్ స్పీడ్: గంటకు 115 కి.మీ
బ్యాటరీ రేంజ్: ఒక ఛార్జ్‌కి 176 కిలోమీటర్లు
ఎక్స్-షోరూమ్ ధర: రూ.92,999
మంచి స్పీడ్, సూపర్ లుక్, స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న ఈ స్కూటర్ డైలీ యూసేజ్‌కి హీరో విడా V2 బెస్ట్.
మోడల్: విడా వి2 లైట్
టాప్ స్పీడ్: గంటకు 69 కి.మీ
బ్యాటరీ రేంజ్: ఒక ఛార్జ్‌పై 94 కి.మీ
ఎక్స్-షోరూమ్ ధర: రూ.85,000
మోడల్- విడా వి2 ప్లస్
టాప్ స్పీడ్: గంటకు 85 కి.మీ
బ్యాటరీ రేంజ్: ఒక ఛార్జ్‌పై 143 కి.మీ
ఎక్స్-షోరూమ్ ధర: రూ.97,800
మీకు స్ట్రాంగ్, ఎక్కువ కాలం వచ్చే స్కూటర్ కావాలంటే హోండా QC1 మంచి ఆప్షన్.
మోడల్- QC1 STD
టాప్ స్పీడ్: గంటకు 50 కి.మీ
బ్యాటరీ రేంజ్: ఒక ఛార్జ్‌పై 80 కి.మీ
ఎక్స్-షోరూమ్ ధర: రూ.90,000
ఇది చాలా తక్కువ ధరలో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ మాగ్నస్ EX. దీని రేంజ్ కూడా బాగుంటుంది.
మోడల్- మాగ్నస్ EX STD
టాప్ స్పీడ్: గంటకు 50 కి.మీ
సింగిల్ ఛార్జ్ బ్యాటరీ రేంజ్: ఒక ఛార్జ్‌కి 100 కి.మీ
ఎక్స్-షోరూమ్ ధర: రూ.67,999
మీకు స్టైల్, పర్ఫార్మెన్స్ రెండూ కావాలంటే BGauss C12i ఇది మంచి ఆప్షన్.
మోడల్- C12i Ex
టాప్ స్పీడ్: గంటకు 60 కి.మీ
బ్యాటరీ రేంజ్: ఒక ఛార్జ్‌పై 85 కి.మీ
ఎక్స్-షోరూమ్ ధర: రూ.99,990