క్రెడిట్ కార్డు ఎడా పెడా వాడేస్తున్నారా అయితే, ఇది మీకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఇకపై క్రెడిట్ కార్డు వాడి అద్దె చెల్లించినట్లయితే, మీ జేబు పై మరింత భారం పెరిగే అవకాశం ఉంది. కావున మార్చి 17 నుంచి ఎస్బిఐ క్రెడిట్ కార్డు వారు మారుతున్న నిబంధనల దృష్ట్యా మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన క్రెడిట్ కార్డ్ ఛార్జీలను మార్చింది. SBI కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ క్రెడిట్ కార్డ్ ఫీజులో మార్పుల గురించి తెలియజేసింది. కొత్త ఛార్జీలు క్రెడిట్ కార్డ్ వినియోగదారులందరికీ మార్చి 17, 2023 నుండి అమల్లోకి వస్తాయని, కస్టమర్‌లకు పంపిన SMS మరియు ఇ-మెయిల్‌లో తెలియజేసింది. క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లించే కస్టమర్లకు అదనంగా రూ.199తో పాటు పన్ను విధించనున్నట్లు కొత్త నిబంధనల్లో పేర్కొంది. గతంలో ఈ చార్జీ రూ. 99గా ఉండేది. నవంబర్ 2022లో, SBI కార్డ్‌లు SBI క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపు లావాదేవీలపై ఛార్జీని రూ.199కి పెంచాయి.
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు SBI కార్డ్‌లు పంపిన ఇటీవలి ఎస్ఎంఎస్ పంపింది : 'SBI క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లింపు లావాదేవీలపై ఛార్జీలు మార్చి 17, 2023 నుండి అమలులోకి వస్తాయి.' కాబట్టి, క్రెడిట్ కార్డ్ వినియోగదారులు కొత్త ఛార్జీల గురించి తెలుసుకోవాలి. లేదంటే మార్చి 17 తర్వాత క్రెడిట్ కార్డు వాడితే జేబుపై భారం పెరిగే అవకాశం ఉంది.
ఇతర బ్యాంకుల్లో ఛార్జీలు ఎంత?
SBI కాకుండా ఇతర బ్యాంకులు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి అద్దె చెల్లింపు కోసం ఎంత వసూలు చేస్తాయి? తెలుసుకుందాం.
>> ICICI బ్యాంక్ అందించిన సమాచారం ప్రకారం , క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అద్దె చెల్లింపు కోసం 1% ప్రాసెసింగ్ ఫీజు అక్టోబర్ 20, 2022 నుండి ఛార్జ్ చేయబడుతుంది.
>> 100% అద్దె చెల్లింపు కోసం HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 1 శాతం పన్ను వసూలు చేస్తోంది.
>> కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అద్దె చెల్లింపు చేస్తే ఫిబ్రవరి 15, 2023 నుండి మొత్తం లావాదేవీపై 1 శాతం రుసుమును విధిస్తోంది.
>> ఫిబ్రవరి 1, 2023 నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన అద్దె చెల్లింపులపై మొత్తం లావాదేవీలో 1% రుసుము విధించబడుతుంది.
యాప్‌లలో అద్దె చెల్లింపు కోసం రుసుములు
క్రెడిట్ కార్డ్‌ల ద్వారా ఇంటి అద్దె చెల్లింపును అనుమతిస్తాయి. ఈ యాప్‌లు అద్దె చెల్లింపులపై వసూలు చేస్తాయి. ఉదాహరణకు, Credలో, క్రెడిట్ కార్డ్ ద్వారా అద్దె చెల్లిస్తే, 1% నుండి 1.75% వరకు సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తారు.
