యాపిల్ తన యాప్ స్టోర్ నుండి ట్విట్టర్‌ యాప్ తొలగిస్తామని బెదిరించింది. దీంతో రెండు టెక్నాలజీ దిగ్గజాల మధ్య యుద్ధానికి తెర లేచింది. అయితే పరిస్థితులకు కారణమేంటో తెలుసుకుందాం. 

ఆపిల్ తన యాప్ స్టోర్ నుండి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను బ్లాక్ చేస్తామని బెదిరించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ స్వయంగా ట్వీట్ చేసి మరీ తెలిపారు. ఐఫోన్ కంపెనీ తన వినియోగదారులను ప్రభావితం చేసే అన్ని సెన్సార్‌షిప్ చర్యలను ప్రచురిస్తుందా అని పోల్ వినియోగదారులు అడిగిన తర్వాత ఆపిల్ ట్విట్టర్‌లో చాలా ప్రకటనలను బ్లాక్ చేసిందని మస్క్ సోమవారం ట్వీట్ చేశారు.

దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయిన ఆపిల్ తన యాప్ స్టోర్ నుండి ట్విట్టర్‌ను విత్ డ్రా చేసుకుంటామని బెదిరించింది.ఈ విషయాన్ని మస్క్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.

ఆపిల్ తన యాప్ స్టోర్ నుండి ట్విట్టర్‌ను తొలగిస్తామని ఆపిల్ బెదిరించిందని ఎలాన్ మస్క్ ఆపిల్ కంపెనీపై ఆరోపణలు చేశారు. ఈ సమాచారాన్ని మస్క్ స్వయంగా ట్వీట్ చేశారు. ట్విట్టర్‌ను బ్లాక్ చేయాలని యాపిల్ అన్ని విధాలుగా ఒత్తిడి తెస్తోందని మస్క్ అన్నారు. 

కంటెంట్ మోడరేషన్ డిమాండ్‌పై ఆపిల్ ట్విట్టర్‌పై ఒత్తిడి తెస్తోందని ఎలాన్ మస్క్ ఆపిల్ పై ఆరోపణలు చేశారు. ఇతర కంపెనీలపై పదే పదే నిబంధనలు విధించే ప్రయత్నాలు జరుగుతున్నందున యాపిల్ ఈ ఆరోపణలు చేసినట్టు మస్క్ పేర్కొన్నారు యాపిల్ ఇప్పటికే Gab, Parlour వంటి యాప్‌లను తొలగించినట్లు మస్క్ గుర్తు చేశారు. 

ఆపిల్ సంస్థ ట్విట్టర్‌లో అన్ని రకాల ప్రకటనలు ఇవ్వడం ఆపివేసిందని ఎలాన్ మస్క్ తన ట్వీట్ ద్వారా తెలిపారు. అమెరికాలో వాక్ స్వాతంత్య్రాన్ని ట్విట్టర్ ద్వేషిస్తుందా. అంటూ ప్రశ్నించారు. అంతే కాదు Apple CEO టిమ్ కుక్ ట్విట్టర్ ఖాతాకు ఈ ట్వీట్ ను ట్యాగ్ చేశాడు- "ఇక్కడ ఏమి జరుగుతోంది?" అంటూ ఎలాన్ మస్క్ అడిగిన ఈ ప్రశ్నకు ఆపిల్ నుంచి సమాధానం రాలేదు.

ప్రముఖ యాడ్ ఏజెన్సీ Pathmatics ప్రకారం ప్రపంచంలోని అత్యంత విలువైన సంస్థ Apple, నవంబర్ 10 , 16 మధ్య ట్విటర్ ప్రకటనల కోసం 131,600 డాలర్లు ఖర్చు చేసింది అయితే గత నెలతో పోల్చితే అక్టోబర్ 16, 22 మధ్య ఖర్చు చేసిన దానితో పోల్చితే ఈ మొత్తం 220,800 డాలర్లు తగ్గింది.

ఇదిలా ఉంటే ఏడాదిన్నర వ్యవధిలో, ట్విట్టర్ వినియోగదారుల సంఖ్య నెలకు రికార్డు స్థాయిలో 1 బిలియన్ దాటగలదని మస్క్ ప్రకటించారు.