Asianet News TeluguAsianet News Telugu

‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ వివాదం.. అతను ఎవరో తెలీదంటూ మాట మార్చిన రామలింగరాజు..

ఈ ఎపిసోడ్‌ నిర్మాతలు "తన కుటుంబం పూర్వీకుల గురించి మోసపూరితంగా సమాచారాన్ని సేకరించారు" అని రామలింగరాజు  తన దరఖాస్తులో పేర్కొన్నారు. అయితే చిత్రీకరణలో సత్యం కంప్యూటర్స్‌ మాజీ ఛైర్మన్‌ రామలింగరాజు సూచనలతో నిక్షిప్తపరిచిన సమాచారాన్ని వినియోగించుకోవడానికి ఆయన మేనేజరు హరి అనుమతులు ఇచ్చారని  అయితే ఇప్పుడు హరి ఎవరో తనకు తెలియదంటూ రామలింగరాజు మాట మార్చారని నెట్‌ఫ్లిక్స్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. 

Bad Boy Billionaires netflix issue  Ramalinga Raju says he doesnt know who is hari
Author
Hyderabad, First Published Nov 21, 2020, 3:53 PM IST

సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బి. రామలింగరాజు తెలంగాణ హైకోర్టులో మధ్యంతర దరఖాస్తును దాఖలు చేశారు. నెట్‌ఫ్లిక్స్ లో విడుదల కావడానికి ముందే అతనిపై ఆధారపడిన ‘బాడ్ బాయ్ బిలియనీర్స్’ ఎపిసోడ్‌ను తనకు చూపించాలని కోరారు.

ఎపిసోడ్ విడుదలను అడ్డుకున్న హైదరాబాద్ సివిల్ కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా నెట్‌ఫ్లిక్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తున్న చీఫ్ జస్టిస్ రాఘ్వేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ అభిషేక్ రెడ్డిల ధర్మాసనం ముందు రామలింగరాజు  దరఖాస్తును అందించినట్లు తెలిపింది.

ఈ ఎపిసోడ్‌ నిర్మాతలు "తన కుటుంబం పూర్వీకుల గురించి మోసపూరితంగా సమాచారాన్ని సేకరించారు" అని రామలింగరాజు  తన దరఖాస్తులో పేర్కొన్నారు.

అయితే చిత్రీకరణలో సత్యం కంప్యూటర్స్‌ మాజీ ఛైర్మన్‌ రామలింగరాజు సూచనలతో నిక్షిప్తపరిచిన సమాచారాన్ని వినియోగించుకోవడానికి ఆయన మేనేజరు హరి అనుమతులు ఇచ్చారని  అయితే ఇప్పుడు హరి ఎవరో తనకు తెలియదంటూ రామలింగరాజు మాట మార్చారని నెట్‌ఫ్లిక్స్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.

also read వచ్చే నెల నుండి మారనున్న బ్యాంకు లావాదేవీల నియమాలు.. దీని వల్ల లాభాలెంటో తెలుసుకోండి.. ...

ఈ డాక్యుమెంటరీ విడుదలకు ముందు కూడా వివరాలను హరికి పంపామని, ఆయన అభినందనలు తెలిపారని వివరించారు. అయినా అందుబాటులో ఉన్న సమాచారాన్ని వినియోగించుకోవడానికి, డాక్యుమెంటరీ పేరు పెట్టడానికి ఎవరి అనుమతులూ అవసరం లేదన్నారు.

‘బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌’ డాక్యుమెంటరీని నిలిపివేస్తూ కింది కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై నెట్‌ఫ్లిక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసెస్‌ ఇండియా హైకోర్టులో అప్పీలు దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్‌ బి.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణను కొనసాగించింది.

నెట్‌ఫ్లిక్స్‌ తరఫు న్యాయవాది నీరజ్‌ కిషన్‌ కౌల్‌ వాదనలు వినిపిస్తూ ఇది రామలింగరాజు ప్రైవేటు, వ్యక్తిగతానికి సంబంధించిన అంశం కాదని, కార్పొరేట్‌ వ్యవహారమని, ఇది పెద్ద ఆర్థిక నేరమని తెలిపారు. ఇందులో ప్రజలకు, వాటాదారులకు, కంపెనీలకు సంబంధం ఉందన్నారు.

12 ఏళ్లుగా ప్రజాబాహుళ్యంలో సమాచారం ఉందని, రామలింగరాజు చేసిన తప్పును అంగీకరిస్తూ స్వయంగా లేఖ విడుదల చేశారని చెప్పారు. కోర్టు రికార్డులోని సమాచారాన్ని వాడుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు.

ఇందుకు స్పందించిన ధర్మాసనం రికార్డుల్లో నిక్షిప్తమైన సమాచారాన్ని వినియోగించుకోవడంలో చట్టం ఏమేరకు అనుమతిస్తుందన్న దానిపై వాదనలు వినిపించాలంటూ తదుపరి విచారణను డిసెంబరు 4కు వాయిదా వేసింది.  

Follow Us:
Download App:
  • android
  • ios