అయోధ్య ఆలయ ప్రతిష్ఠాపన దినోత్సవానికి సంబంధించి మరిన్ని రాష్ట్రాలు కూడా సెలవు ప్రకటించాయి. మధ్యప్రదేశ్ కూడా ప్రభుత్వ సంస్థలతో సహా మధ్యాహ్నం వరకు సెలవు ప్రకటించింది.  

న్యూఢిల్లీ: అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపన దినోత్సవం సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్లకు ఆర్‌బీఐ సెలవు ప్రకటించింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు సోమవారం పూర్తిగా సెలవు ఉంటుంది. సోమవారానికి బదులుగా శనివారం నేడు స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి.

22వ తేదీ మనీ మార్కెట్, విదేశీ మారకద్రవ్యం అండ్ ప్రభుత్వ సెక్యూరిటీల సెటిల్‌మెంట్ లావాదేవీలకు సెలవు. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులకు కూడా 22న పూర్తి సెలవు ప్రకటించారు. 

మరోవైపు అయోధ్య ఆలయ ప్రతిష్ఠాపన దినోత్సవానికి సంబంధించి మరిన్ని రాష్ట్రాలు కూడా సెలవు ప్రకటించాయి. మధ్యప్రదేశ్ కూడా ప్రభుత్వ సంస్థలతో సహా మధ్యాహ్నం వరకు సెలవు ప్రకటించింది.

10 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే జనవరి 22న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మధ్యాహ్నం వరకు సెలవు ప్రకటించారు. కాగా, అయోధ్యలో ప్రతిష్ఠా రోజుకి సంబంధించిన వేడుకలు ఐదో రోజు కూడా కొనసాగనున్నాయి.