Asianet News TeluguAsianet News Telugu

బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. భారీగా వేతనాల పెంపు..

పనితీరు ఆధారంగా యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ లో అక్టోబర్ 1 నుండి సిబ్బంది జీతాలను 4% నుండి 12% మధ్య పెంచుతుందని సంబంధిత వర్గాలు తెలిపారు. ముంబైకి చెందిన యాక్సిస్ బ్యాంక్ లో సుమారు 76,000 మంది ఉద్యోగులున్నరు. 

Axis Bank joins top private banks to offer salary hikes to their employees from 1 september
Author
Hyderabad, First Published Oct 6, 2020, 4:55 PM IST

కరోనావైరస్ మహమ్మారి వల్ల ఆర్ధిక వ్యవస్థ పడిపోవడం, ఉద్యోగాల తొలగింపు, వేతనాల కొత ఉన్నప్పటికి భారతదేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రుణదాత యాక్సిస్‌ బ్యాంక్‌  సిబ్బందికి వేతన పెంపును ప్రకటించింది.

పనితీరు ఆధారంగా యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ లో అక్టోబర్ 1 నుండి సిబ్బంది జీతాలను 4% నుండి 12% మధ్య పెంచుతుందని సంబంధిత వర్గాలు తెలిపారు. ముంబైకి చెందిన యాక్సిస్ బ్యాంక్ లో సుమారు 76,000 మంది ఉద్యోగులున్నరు.

యాక్సిస్ బ్యాంక్ సిబ్బందికి వేతన పెంపుతో పాటు బోనస్ కూడా చెల్లించారు. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రుణదాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లిమిటెడ్ కూడా పనితీరు ఆధారంగా ఏప్రిల్‌లో జీతాలను పెంచింది, అదనంగా బోనస్‌లను కూడా చెల్లించింది, ఈ విషయం తెలిసిన సంబంధిత వ్యక్తులు చెప్పారు.

also read అలాంటి వార్తలు నమ్మొద్దు.. పూర్తి భరోసానందిస్తున్నాం: లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ ...

వివిధ వ్యక్తుల ప్రణాళికల ప్రకారం రెండవ అతిపెద్ద ప్రైవేటు-రుణదాత ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ లో 1లక్ష మంది ఉద్యోగులలో 80% మందికి బోనస్ తో పాటు జూలై నుండి వేతన పెంపును ప్రకటించింది.

కరోనా వైరస్ మహమ్మారి వల్ల కొన్ని స్థానిక, ప్రపంచ సంస్థలు ఉద్యోగాలు తగ్గించి చెల్లించమని బలవంతం చేయడంతో వేతనాలు పెరుగున్నాయని సమాచారం. భారతదేశ నాల్గవ అతిపెద్ద ప్రైవేట్ రుణదాత కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ 2.5 మిలియన్ రూపాయల ($ 34,109) కంటే ఎక్కువ సంపాదించే అధికారుల జీతంలో 10% కోత, సీనియర్ మేనేజ్మెంట్ వారి జీతల్లో 15% కోత తీసుకుంటుంది.

ఇక కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోవడంతో భవిష్యత్‌లో తమ వ్యాపారాలు ప్రభావితం కాకుండా యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహింద్ర బ్యాంక్‌, ఐసీఐసీ బ్యాంక్‌లు ఈక్విటీ మార్కెట్ల ద్వారా 900 కోట్ల డాలర్లను సమీకరించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios