Asianet News TeluguAsianet News Telugu

ఈ బ్రిడ్జి గురించి మీరు తెలుసుకోవలసిన 10 విషయాలు.. ఇంజనీరింగ్ అద్భుతం..

ఈ వంతెన ముంబై నుండి పూణే ఎక్స్‌ప్రెస్‌వే మధ్య ప్రయాణ సమయాన్ని  తగ్గిస్తుంది ఇంకా రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాంతాలకు కూడా అనుసంధానాన్ని అందిస్తుంది.

Atal Setu to be inaugurated today: 10 things to know about this engineering marvel-sak
Author
First Published Jan 13, 2024, 2:48 PM IST

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)ను ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించారు. రూ.21,200 కోట్లతో నిర్మించిన 'అటల్ బిహారీ వాజ్‌పేయి సేవరీ-నవ శేవ అటల్ సేతు' భారతదేశంలోనే అతి పొడవైన సముద్ర వంతెనగా మాత్రమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన వంతెనగా కూడా 12వ స్థానంలో నిలిచింది. 

ఈ వంతెన ముంబై అండ్ పూణే ఎక్స్‌ప్రెస్ వే మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది ఇంకా రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాంతాలకు కూడా కనెక్షన్‌ని అందిస్తుంది.

ఈ వంతెన ముంబైలోని సెవ్రి నుండి మొదలై, రాయ్‌గఢ్ జిల్లాలోని ఉరాన్ తాలూకాలోని న్హవా షెవా వద్ద ముగుస్తుంది. ఈ వంతెన ముంబై నుండి నవీ ముంబై మధ్య దూరాన్ని  20 నిమిషాలకి తగ్గిస్తుంది, ఇంతకు ముందు 2 గంలు  పట్టేది. 

 MTHL అనేది ఆరు లేన్ల సముద్ర లింక్, ఇంకా సముద్రం మీద 16.50 కిలోమీటర్లు అలాగే  భూమిపై 5.50 కిలోమీటర్లు ఉంటుంది. MTHLలో కార్లకు వన్-వే టోల్‌గా రూ. 250 వసూలు చేసే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 

 ప్రయాణీకుల కారుకు రూ. 250 వన్-వే టోల్ వసూలు చేయబడుతుంది, రియార్న్ ప్రయాణాలకు అలాగే ప్రతిరోజు అండ్  తరచుగా ప్రయాణించేవారికి ఛార్జీలు భిన్నంగా ఉంటాయి.

క్యాబినెట్ నిర్ణయం ప్రకారం, కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుండి ఒక సంవత్సరం తర్వాత రివ్యూ  అనంతర రేట్లు సవరించబడతాయి.

 దీని నిర్మాణానికి దాదాపు 500 బోయింగ్ విమానాల బరువు అండ్  ప్యారిస్ ఈఫిల్ టవర్ బరువు కంటే 17 రెట్లు ఉక్కును ఉపయోగించారు.  ప్రతిరోజు 70,000 వాహనాలు వంతెనను ఉపయోగిస్తాయని అంచనా.

 MTHLలో నాలుగు చక్రాల వాహనాల గరిష్ట స్పీడ్  పరిమితి గంటకు 100 కిలోమీటర్లు ఉంటుంది, అయితే సముద్ర వంతెనపై బైక్స్, ఆటోరిక్షాలు ఇంకా ట్రాక్టర్‌లను అనుమతించరు.

కార్లు, టాక్సీలు, తేలికపాటి మోటారు వాహనాలు, మినీబస్సులు ఇంకా రెండు-యాక్సిల్ బస్సులు వంటి వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల స్పీడ్  పరిమితితో ఉంటాయి ఇంకా వంతెన ఎక్కేటప్పుడు అండ్ అవరోహణలో వేగం గంటకు 40 కిలోమీటర్లకు పరిమితం చేయబడుతుంది. ముంబై "ప్రమాదం, అడ్డంకులు ఇంకా  ప్రజలకు అసౌకర్యం" నివారించడానికి స్పీడ్ లిమిట్  ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు.

ముంబై వైపు వెళ్లే మల్టీ-యాక్సిల్ హెవీ వెహికల్స్, ట్రక్కులు ఇంకా  బస్సులకు తూర్పు ఫ్రీవేలో ప్రవేశం ఉండదని ముంబై పోలీసు అధికారి ఒకరు  తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios