Asianet News TeluguAsianet News Telugu

మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతోందని భయపడుతున్నారా, అయితే వెంటనే ఆన్ లైన్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..

మీకు తెలియకుండానే మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి బ్యాంకు లోన్ అప్లై చేశారని అనుమానిస్తున్నారా, మీ ఆధార్ ఉపయోగించి దేశ విధ్రోహ చర్యలకు పాల్పడుతున్నారని అనుమానం కలుగుతోందా. అయితే వెంటనే మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా ఆన్ లైన్ ద్వారా ఏం చేయాలో తెలుసుకోండి.

Are you worried that your Aadhaar card is being misused, but immediately check online like this MKA
Author
First Published Feb 7, 2023, 6:11 PM IST

ప్రస్తుత కాలంలో ఆధార్ అనేది ప్రతి మనిషికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఈ 12 అంకెల ఆధార్ సంఖ్యతో అనేక ప్రభుత్వ పథకాలను పొందే వీలుంది. అలాగే మీ ఐడెంటిటీ ప్రూఫ్ కింద కూడా ఆధార్ ను వాడవచ్చు.  భారతీయ పౌరులకు ఆధార్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ అయితే దీని దుర్వినియోగం చేయడం ద్వారా అనేక నష్టాలు ఉన్నాయి అందుకే ఆధార్ సంఖ్యను ఎక్కడపడితే అక్కడ నమోదు చేయకూడదని న్యాయస్థానాలు సైతం చెప్పాయి.  ముఖ్యంగా ఆధార్ సంఖ్యను ఎవరు అడిగినా కారణం లేకుండా చెప్పకూడదని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ సంఖ్యను ఉపయోగించి మీకు తెలియకుండానే లోన్లను సైతం పొందే వీలుంది సైబర్ క్రైమ్ చేసే వారికి ఆధార్ సంఖ్య ఒక ముఖ్య సాధనం అనే చెప్పాలి అందుకే మీ ఆధార్ సంఖ్య దుర్వినియోగం కాకుండా ఎలా జాగ్రత్త పడాలో ప్రస్తుతం మనం కొన్ని చిన్న స్టెప్స్ ద్వారా తెలుసుకుందాం.

ఆధార్ అనేది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు, ఆధార్ కార్డ్‌లో మీ పేరు, నివాస చిరునామా, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌లు, ముఖ చిత్రాలు లాంటి బయోమెట్రిక్ ఆధారాలు మీ వ్యక్తిగత సమాచారం కూడా ఉంటుంది.  అందుకే ఆధార్ డేటా అనేది చాలా గోపియంగా ఉంచాల్సిన అవసరం ఉంది అలాగే దీని దుర్వినియోగం కాకుండా పౌరులు సైతం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. 

ఆధార్‌లో మీ వ్యక్తిగత సమాచారం ఉంటుంది, అందుకే దీన్ని  ఎప్పుడూ సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆధార్‌ను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI), మీ కార్డును ఎవరైనా దుర్వినియోగం చేశారో లేదో తనిఖీ చేయడానికి 'ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ' అనే సదుపాయాన్ని  అందుబాటులోకి తెచ్చింది. 

మీ ఆధార్ హిస్టరీని ఆన్‌లైన్‌లో ఎలా తనిఖీ చేయాలో తెలుసుకుందాం. 

స్టెప్  1: UIDAI , అధికారిక వెబ్‌సైట్‌ www.uidai.gov.in ను సందర్శించండి. 

స్టెప్  2: 'My Aadhaar' ఆప్షన్ కి వెళ్లి, ఆధార్ సేవల కింద 'Aadhaar Authentication History'పై క్లిక్ చేయండి.

స్టెప్  3: మీ ఆధార్ నంబర్ , సెక్యూరిటీ కోడ్‌తో లాగిన్ చేసి, Send OTPపై క్లిక్ చేయండి.

స్టెప్  4: ఆథంటికేషన్ కోసం OTPని ఎంట్రీ చేయండి , 'Proceed'పై క్లిక్ చేయండి

స్టెప్  5: మీ ఆధార్ కార్డ్ , మునుపటి ఆథంటికేషన్ రిక్వెస్ట్ సహా ఇతర అన్ని వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి

మీ ఆధార్‌ను దుర్వినియోగం చేసినట్లు అనుమానించినట్లయితే, వీలైనంత త్వరగా UIDAIని సంప్రదించాలి. UIDAIని సంప్రదించడానికి మీరు టోల్ ఫ్రీ నంబర్ 1947ని ఉపయోగించవచ్చు. మీరు help@uidai.gov.inకి ఇమెయిల్ పంపవచ్చు.


 

Follow Us:
Download App:
  • android
  • ios