ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ప్రకటనల్లో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టండి అని విరివిగా కనిపిస్తున్నాయి. టి.వి. ఛానెల్స్‌లో కూడా 'మ్యూచువల్ ఫండ్స్ సాహీ హై'  అడ్వర్టైజ్మెంట్ లు వస్తున్నాయి. అయితే ఇన్ని  రకాలుగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టండి అంటూ ప్రచారం ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో  మనం ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో  పెట్టుబడి పెట్టాలి? మనకు సరైనదాన్ని ఎలా ఎంచుకోవాలి ?  ఇలాంటివి  తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సాధారణంగా మనం డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ కింద డిపాజిట్ చేస్తూ ఉంటాము. ఈ డిపాజిట్లపై బ్యాంకులు నిర్ణీత మొత్తంలో వడ్డీ చెల్లిస్తూ ఉంటాయి. అదే డబ్బును మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లయితే అంతకన్నా చాలా రెట్లు డబ్బు సంపాదించవచ్చని, నిపుణులు చెబుతున్నారు.

మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్ అనేది ప్రజల నుండి డబ్బును సేకరించి, ఆ డబ్బును వివిధ కంపెనీల స్టాక్‌లు, బాండ్లు, ఇతర రంగాలలో పెట్టుబడి పెడతారు. ఈ విధంగా ప్రజలు పెట్టిన పెట్టుబడి డబ్బును ఆర్థిక, పెట్టుబడి నిపుణుల బృందం నిర్వహిస్తుంది. వీరిని 'ఫండ్ మేనేజర్లు' అంటారు.

సంపదను పెంచుకోవాలనుకునే వారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. ఇక్కడ మీ పని డబ్బును సరైన ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం. మిగిలిన పనిని ఫండ్ మేనేజర్లు చేస్తారు. నిజానికి స్టాక్స్ లేదా బాండ్లలో నేరుగా పెట్టుబడి పెట్టడం అనేది మీ స్వంత కారును నడపడం లాంటిది. మీకు కారుపై పూర్తి నియంత్రణ ఉండి, మీరు డ్రైవింగ్‌లో నిపుణుడిగా ఉండాలి. మీ దృష్టిని నిరంతరం రహదారిపై ఉంచాలి. అంతేకాకుండా, ఇంధనం, మరమ్మతు ఖర్చులు మీరే భరించాలి.

మరోవైపు మ్యూచువల్ ఫండ్స్. పెట్టుబడి పెడితే మీకు 'షేర్ టాక్సీ' దొరికినట్లే. మీకు కారుపై పూర్తి నియంత్రణ ఉండాల్సిన అవసరం లేదు.మీ ప్రయాణం కూడా చౌక. మీరు డ్రైవింగ్, ప్రయాణ మార్గం లేదా కారు మరమ్మత్తుల గురించి చింతించాల్సిన పనిలేదు. మీ డ్రైవర్ అంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఆ పనులన్నీ చూసుకుంటాడు. సరళంగా చెప్పాలంటే, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది.

ఎందుకు పెట్టుబడి పెట్టాలి?

మ్యూచువల్ ఫండ్ ఎక్కువ సంపాదించడానికి ఉత్తమ ఎంపిక అనడంలో సందేహం లేదు మ్యూచువల్ ఫండ్ నుండి కొన్ని ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. 

వీటిలో ఇన్వెస్ట్ చేయడం సులభం.

ప్రతి నెలా ఒక మొత్తాన్ని నిర్ణయించడం ద్వారా SIP ద్వారా సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు వెయ్యి రూపాయలు తక్కువ మొత్తంగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలంలో దాని ద్వారా వచ్చే సంపాదన భారీగా ఉంటుంది.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి రాబడులు ఇతర పెట్టుబడుల కంటే ఎక్కువగా ఉన్నాయని పై ఉదాహరణ స్పష్టం చేస్తుంది. మీరు నెలకు రూ. 10,000 పెట్టుబడి పెడితే, మీరు 20 సంవత్సరాలలో దాదాపు రూ. 1 కోటి సంపాదించవచ్చు. పెట్టుబడి కాలం, మొత్తాన్ని నిర్ణయించి, మీకు సరిపోయే ఫండ్‌ను ఎంచుకుని, పెట్టుబడిని ప్రారంభించండి.

ఎలా ప్రారంభించాలి?: 

మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటే సరిపోదు. మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఫండ్స్‌లో సరైనదాన్ని ఎంచుకోవాలి. ఒకరి సలహా విని తలవంచుకుని పెట్టుబడి పెడితే లాభం లేదు. మరింత సమాచారం తెలుసుకోవాలి. నిపుణుల సలహా తీసుకొని పెట్టుబడిని ప్రారంభించడం మంచిది.

మ్యూచువల్ ఫండ్స్ కు రేటింగ్స్ కూడా ఉంటాయి సాధారణంగా ఈ రేటింగ్స్ ను క్రిసిల్ సంస్థ జారీ చేస్తూ ఉంటుంది. అలాగే మీరు ఎంపిక చేసుకున్న ఫండ్ ఏ షేర్లలో పెట్టుబడులు పెడుతుందో గమనించాల్సి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుండం ద్వారా మీరు సరైన ఎంపిక చేసుకోవచ్చు