మరోసారి మార్కెట్లోకి 1000 రూపాయల నోట్లు వస్తున్నాయా..? డిజిటల్ చెల్లింపులు ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్నాయా..?

రూ.2000 నోటును రద్దు చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయం తీసుకున్న తర్వాత వెయ్యి రూపాయల నోటు ప్రవేశపెట్టనున్నారు అని చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.

Are 1000 rupees notes coming in the market once again..? Are digital payments still facing challenges MKA

2000 రూపాయల నోటును ఉపసంహరించుకోవడానికి కారణం ఏమిటనే క్యూరియాసిటీ కూడా నెలకొంది. అంతే కాదు ఆర్బీఐ కొత్త కరెన్సీని ఏ వ్యాల్యూతో ప్రవేశపెడుతుందనే ఆసక్తి సభలో నెలకొంది. ఆర్‌బీఐ రూ.1000 నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సీనియర్ జర్నలిస్ట్ జీ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింఘ్వీ అభిప్రాయపడ్డారు. ఆయన అంచనా ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో వెయ్యి రూపాయల నోట్లను ఆర్‌బీఐ చలామణిలోకి తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. దీనికి ఆయన కారణం చెప్పారు.  డాలర్‌తో పోలిస్తే రూపాయి ప్రతి సంవత్సరం క్షీణిస్తోంది.అలాగే పలు మెటీరియల్ ధరల పెరుగుదల కారణంగా  ఖర్చు పెరుగుతుంది. ఇందుకోసం ఎక్కువ డబ్బు చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రూ. 1000 నోట్లను ప్రవేశపెట్టే అంశాన్ని కొట్టి పారేయలేమన్నారు. 

క్షీణిస్తున్న రూపీ విలువతో కరెన్సీ నోట్లకు పెరుగుతున్న డిమాండ్..

అంతర్జాతీయంగా డాలర్  పెరుగుదల, రూపీ పతనం నేపథ్యంలో  ప్రస్తుతం మార్కెట్లో పెద్ద నోట్ల అవసరం ఏర్పడింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం నగదు కంటే డిజిటల్ లావాదేవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 1000 రూపాయల నోట్లను ఎక్కువ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అవకాశాలు తక్కువేనన్న అభిప్రాయాన్ని కూడా కొందరు నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 

అమెరికాలో నేటికీ కరెన్సీ నోట్ల ద్వారానే మెజారిటీ చెల్లింపులు

అమెరికా లాంటి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ నేటికీ కూడా పూర్తిస్థాయిలో డిజిటల్ చెల్లింపులను అమలు చేయలేకపోతోంది అక్కడ ఇప్పటికి కూడా 100 డాలర్ల విలువ కలిగిన నోట్లనే ప్రపంచ వ్యాప్తంగా  ఎక్కువగా వాడుతున్నారు. అయితే మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిపోవడం లేదు. ఈ నెట్‌వర్క్ సమస్య ఆర్థిక వ్యవస్థ డిజిటలైజేషన్ ప్రక్రియను మందగిస్తోంది. 

డిజిటలైజేషన్ నేటికీ మన దేశంలో సవాలే..

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ లేదా UPI చెల్లింపులు ఇప్పటికీ సవాలుగానే ఉన్నాయి. సాయంత్రం కాగానే యూపీఐలు పనిచేయడం లేదు. సర్వర్లు మొరాయిస్తున్న కంప్లైంట్లు మనకు వినియోగ దారుల నుంచి వస్తున్నాయి. ఒక్కో సారి చెల్లింపులు మధ్యలో ఆగిపోయి మూడు రోజుల పాటు డబ్బు ఫ్రీజ్ అయిపోతోంది. అంతేకాకుండా, ఆన్‌లైన్ లావాదేవీలు ఫలితంగా సైబర్ మోసాల కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో అవగాహన లేకపోవడంతో సామాన్యులు సైబర్ మోసాలకు గురవుతున్నారు. అందువల్ల చాలా చోట్ల నగదు లావాదేవీలు కూడా అవసరం. కాబట్టి ప్రజలకు కూడా వివిధ డినామినేషన్ల నోట్లు అవసరం అవుతున్నాయి. 

2016లో నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం పాత 1000, 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంది. 1000 రూపాయల స్థానంలో కొత్త రూ. 2 వేల నోట్లను ప్రవేశపెట్టారు. దీంతో పాటు కొత్త రూ.500 నోట్లను కూడా  ప్రవేశపెట్టారు. నల్లధనం, ఉగ్రవాదం తదితర లక్ష్యాలను సాధించడం కోసమే ఇలా చేశారన్నారు. 2018-19లోనే 2,000 డినామినేషన్ నోట్ల ముద్రణను RBI నిలిపివేసింది. ఆ విధంగా 2000 రూ. దేశంలోని చాలా ఏటీఎంలలో మాయమయ్యాయి.. దీనిపై గతంలో పార్లమెంట్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

అయితే తాజాగా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న తర్వాత ఇప్పుడు వెయ్యి రూపాయల నోట్లను  ప్రవేశపెడితే, మార్కెట్లో  నగదు కొరతకు  ఉపశమనం లభించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios