సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ సౌదీ అరాంకోను దాటి ఆపిల్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. శుక్రవారం వ్యాపారం ముగిసే సమయానికి, ఆపిల్ మార్కెట్ విలువ 1.84 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేరుకున్నది.

కాగా, సౌదీ అరాంకో వాల్యు 1.76 ట్రిలియన్లు అని ఒక వార్తా పత్రిక తెలిపింది. మార్చి చివరి నుండి చాలావరకు స్థిరంగా ఉన్న ఆపిల్ స్టాక్, శుక్రవారం  యాపిల్‌ షేరు 10 శాతం కంటే ఎక్కువ పెరిగింది.

also read టిక్‌టాక్‌ పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు.. అమెరికాలో కూడా బ్యాన్.. ...

క్యూ3 ఆపిల్ మొత్తం ఆదాయం 59.7 బిలియన్లను తాకింది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 11 శాతం పెరిగింది. మాక్, ఐప్యాడ్ అమ్మకాలు ఒక హైలైట్ గా నిలిచాయి, కోవిడ్-19 మహమ్మారి కారణంగా కంపెనీ డివైజెస్ కోసం డిమాండ్ పెరిగింది.

ఆపిల్ మూడవ త్రైమాసిక ఆదాయంలో భాగంగా ఫోర్-ఫర్-వన్ స్టాక్ స్ప్లిట్‌ను ప్రకటించింది, ఇది ఒక వ్యక్తిగత స్టాక్ ధరను తగ్గిస్తుంది.

అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్ అన్నీ నిన్న ఆదాయాన్ని ప్రకటించాయి. అమెజాన్ తన లాభాలను రెట్టింపు చేసింది. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఫేస్ బుక్ రోజువారీ వినియోగదారులు సంవత్సరానికి 12 శాతం పెరిగి 1.79 బిలియన్లకు చేరుకుంది. ఈ నాలుగు కంపెనీలు కలిపి 28.6 బిలియన్ డాలర్ల లాభాలను ఆర్జించాయి.