నీతా అంబానీ 60వ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా 1.4 లక్షల మందికి అన్నసేవ ద్వారా అన్నదానం..

రిలయన్స్ ఫౌండేషన్ అధినేత నీతా అంబానీ నవంబర్ 1న తన 60వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ సారి  ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 3వేల మంది పిల్లల మధ్య నీతా అంబానీ ఈ బర్త్ డే వేడుకను  జరుపుకున్నారు. 
 

anna seva for 1.4lakhs people carried out across india on mrs nita ambanis 60th birthday-sak

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మరియు చైర్‌పర్సన్ నీతా అంబానీ నవంబర్ 1న తన 60వ పుట్టినరోజును జరుపుకున్నారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 3000 మంది పిల్లల మధ్య నీతా అంబానీ ఈ వేడుకను  జరుపుకున్నారు. 

ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన 1.4 లక్షల మందికి అన్నసేవ ద్వారా అన్నదానం చేశారు. అన్న సేవ ద్వారా దాదాపు 75 వేల మందికి వండిన ఆహారాన్ని అందించగా, సుమారు 65 వేల మందికి ముడి రేషన్ ను పంపిణీ చేశారు. ప్రధానంగా పిల్లలకు, వృద్ధాశ్రమాల్లో నివసించే వృద్ధులకు, రోజువారీ వేతన జీవులకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు మరియు ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి ఆహారం అందించారు. ఆంధ్రప్రదేశ్  లో కాకినాడ, విజయవాడ పట్టణాలలో రిలయన్స్ ఫౌండేషన్ అన్నసేవ కార్యక్రమాన్ని చేపట్టింది. సుమారు 600 మందికి కిట్ లను అందించారు.

anna seva for 1.4lakhs people carried out across india on mrs nita ambanis 60th birthday-sak

కరోనా మహమ్మారి సమయంలో కూడా అన్న సేవ పేరుతో రిలయన్స్ ఫౌండేషన్ అతిపెద్ద ఆహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. విద్య, మహిళా సాధికారత, క్రీడలు, కళ మరియు సాంస్కృతిక రంగాలలో నీతా అంబానీ లెక్కలేనన్ని విజయాలు సాధించారు. తన నాయకత్వంలో, రిలయన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా 71 మిలియన్లకు పైగా ప్రజల జీవితాలను ప్రభావితం చేసింది.

anna seva for 1.4lakhs people carried out across india on mrs nita ambanis 60th birthday-sak

ముంబైలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్  నీతా అంబానీ తన 60వ పుట్టినరోజు సందర్భంగా  3000 మందికి పైగా నిరుపేద స్కూల్   పిల్లలు ఎంటర్టైన్మెంట్, గిఫ్ట్స్,  అన్న సేవను ఆస్వాదించారు అయితే వీటిని స్వయంగా నీతా అంబానీ అందించారు. పిల్లలు, మహిళలు తన హృదయానికి దగ్గరగా ఉంటారని నీతా అంబానీ తరచుగా అంటుంటారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios