Asianet News TeluguAsianet News Telugu

ఏంజెల్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్‌లో స్మాల్‌కేస్ సేవలు ప్రారంభం.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి మంచి అవకాశం..

ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ఇప్పుడు దాని అన్నీ ప్లాట్‌ఫామ్‌లలో స్మాల్‌కేస్ ఆఫరింగ్స్ ని చేర్చింది. కొత్త ఇంటిగ్రేషన్ ఏంజెల్ బ్రోకింగ్ వినియోగదారులకు థీమ్ లేదా వ్యూహం ఆధారంగా స్టాక్స్ లేదా ఇటిఎఫ్‌ల క్యూరేటెడ్ బ్యాస్కెట్స్ కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది.
 

Angel Broking offers smallcase services on its platform in india
Author
Hyderabad, First Published Apr 7, 2021, 11:51 AM IST

 ముంబై : మెరుగైన పారదర్శకత, వృత్తిపరంగా నిర్వహించే స్టాక్ బ్యాస్కెట్ తో  దీర్ఘకాలిక ఈక్విటీ పోర్ట్‌ఫోలియోను నిర్మించటానికి ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ ఇప్పుడు స్మాల్‌కేస్ ఆఫరింగ్స్ ను దాని అన్ని ప్లాట్‌ఫామ్‌లలోకి చేర్చారు.  కొత్త ఇంటిగ్రేషన్ ఏంజెల్ బ్రోకింగ్ వినియోగదారుల థీమ్ లేదా వ్యూహం ఆధారంగా స్టాక్స్ లేదా ఇటిఎఫ్‌ల క్యూరేటెడ్ బ్యాస్కెట్స్ కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది.

స్మాల్‌కేసులు అంటే స్టాక్స్ / ఇటిఎఫ్‌ల పోర్ట్ ఫోలియోస్, వీటిని భారతదేశంలోని అగ్రశ్రేణి సెబీ-రిజిస్టర్డ్ సలహాదారులు, పరిశోధనా నిపుణులు క్రియేట్ చేసి నిర్వహిస్తుంటారు. అన్ని పెట్టుబడులు స్మార్ట్ బీటా, థిమాటిక్ అండ్ సెక్టోరల్, ఆల్ వెదర్ ఇన్వెస్టింగ్ ఇతర వాటితో పాటు ఇటిఎఫ్ ఆధారిత స్మాల్‌కేసుల వంటి థీమ్ లేదా వ్యూహం నుండి పొందిన మార్కెట్ అవకాశలపై ఆధారపడి ఉంటాయి. ఈ స్మాల్‌కేసులను వాటి రిస్క్ ఎక్స్‌పోజర్, కనీస పెట్టుబడి మొత్తం ఆధారంగా వర్గీకరించవచ్చు.

ఏంజెల్ బ్రోకింగ్ కస్టమర్లు స్మాల్‌కేసులతో సమాచార నిర్ణయం తీసుకోవటానికి లోతైన ఓవర్ వ్యూ, పద్దతులు, ఫాక్ట్‌షీట్లు, సంబంధిత చార్ట్‌లను పొందవచ్చు. కొత్త ఇంటిగ్రేషన్ తరువాత ఏంజెల్ బ్రోకింగ్ ట్రేడింగ్ ప్రస్తుత అక్కౌంట్, డీమాట్ అక్కౌంట్ ద్వారా యాప్ లో ఎండ్-టు-ఎండ్ లావాదేవీలను కూడా పూర్తి చేయవచ్చు. ఇది దశలవారీగా విడుదల చేయబడుతోంది అలాగే అతి త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది. ఇంకొక అదనపు ప్రయోజనం ఏమిటంటే, ఏంజెల్ బ్రోకింగ్ కస్టమర్లకు స్మాల్‌కేసులను ఉపయోగించటానికి అదనపు చార్జీలు వసూలు చేయదు.


ఇంటెగ్రేషన్ పై ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ శ్రీ ప్రభాకర్ తివారీ మాట్లాడుతూ, “ఏంజెల్ బ్రోకింగ్ టెక్-ఆధారిత ప్రక్రియలు, టూల్స్, ప్లాట్‌ఫారమ్‌లని అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడిదారుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది అని అన్నారు.

స్మాల్‌కేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు & సి‌ఈ‌ఓ శ్రీ వసంత కామత్ “స్మాల్‌కేస్ కాపిటల్ మార్కెట్ పాటిసిపెంట్స్ తో కలిసి పనిచేస్తుంది, భారతదేశపు అత్యంత గౌరవనీయమైన ఆర్థిక సంస్థలతో సహా లక్షల మంది భారతీయులు సింపుల్, పారదర్శక, వైవిధ్యభరితమైన ఉత్పత్తులలో మంచి పెట్టుబడులు పెట్టడానికి సహాయపడుతుంది. స్మాల్‌కేస్ ఏకొ వ్యవస్థకు ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఏంజెల్ బ్రోకింగ్‌తో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది ” అని అన్నారు.

also read ముగిసిన ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం.. రెపో రేటుపై కీలక నిర్ణయం.. ...

వినియోగదారులకు స్మాల్‌కేసు అందించే  కొన్ని ప్రయోజనాలు ఏంటంటే ట్రాకింగ్  పర్ఫర్మెంస్ , రీబ్యాలెన్సింగ్, ఎస్ఐపి- పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో హెల్త్ అనాలిసిస్ అలాగే  క్లయింట్లు 50 స్టాక్‌లతో కూడిన సొంత స్మాల్‌కేసులను సృష్టించవచ్చు.

ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ గురించి:

ఎన్‌ఎస్‌ఇలో ఆక్టివ్ క్లయింట్స్ పరంగా ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ (ఎబిఎల్) భారతదేశంలో అతిపెద్ద రిటైల్ బ్రోకింగ్ హౌస్‌లలో ఒకటి. "ఏంజెల్ బ్రోకింగ్" బ్రాండ్ క్రింద క్లయింట్లకు బ్రోకింగ్ అండ్ అడ్వైజరి సేవలు, మార్జిన్ ఫండింగ్, షేర్లకు వ్యతిరేకంగా రుణాలు, ఆర్థిక ఉత్పత్తుల పంపిణీని అందించే ఆర్థిక సేవల సంస్థనే ఎబిఎల్.

ఆన్‌లైన్ అండ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇంకా 14వేల  మంది ఆథరైజేడ్ వ్యక్తుల నెట్‌వర్క్ ద్వారా బ్రోకింగ్ అండ్ అనుబంధ సేవలు అందించబడతాయి. ఏంజెల్ బ్రోకింగ్ మొబైల్ అప్లికేషన్ అలాగే ఏంజెల్ బీఇ మొబైల్ అప్లికేషన్  10.3 మిలియన్ల డౌన్ లోడ్లకు చేరాయి, ఇది క్లయింట్లకు డిజిటల్ సేవలను పొందటానికి వీలు కల్పిస్తుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios