Asianet News TeluguAsianet News Telugu

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింత సులభంగా..

 కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి  ఏపీకి వచ్చిన సాఫ్ట్ వేర్ ‘టెక్కీ'లు, ఉద్యోగుల కోసం బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరించాలని రాష్ట్ర  ఐ.టి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి నిర్ణయించారు.
 

andhra pradesh government offers broadband services for IT employees
Author
Hyderabad, First Published Aug 27, 2020, 5:02 PM IST

కోవిడ్ -19 నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి  ఏపీకి వచ్చిన సాఫ్ట్ వేర్ ‘టెక్కీ'లు, ఉద్యోగుల కోసం బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరించాలని రాష్ట్ర  ఐ.టి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి నిర్ణయించారు.

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు , వివిధ విభాగాల్లో ఆన్ లైన్, వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వెల్లడించారు. 


 అనుకోని పరిస్థితుల్లో  కరోనా సోకినా ఏపిలో ఉంటే వైద్య సేవలు ప్రభావవంతంగా అందుతాయన్న ఉద్దేశంతో స్వంత రాష్ట్రానికి వచ్చి మరి ఐ.టీ ఉద్యోగులు వారి ఇంటి నుంచే తమ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు.

  వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు , వివిధ హోదాలో పనిచేసే ఉద్యోగులు ఇంటర్నెట్ సేవల విషయంలో ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.   


 ఈ బ్రాడ్ బ్యాండ్ సేవలు పొందడానికి  https://broadband.apit.ap.gov.in/ లింకు ద్వారా సంప్రదించవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios