Asianet News TeluguAsianet News Telugu

సోషల్ మీడియా స్టార్టప్ కంపెనీలో ఆనంద్ మహీంద్రా భారీ పెట్టుబడి..

బ్లాక్‌చెయిన్ సోషల్ మీడియా స్టార్టప్ అయిన హప్రాంప్‌లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా 1 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.7.5కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సిద్దమయ్యారు.

anand mahindra to invest in social media startup hapramp company
Author
Hyderabad, First Published Jun 11, 2020, 4:33 PM IST

న్యూ ఢిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్‌ మీడియా ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ ఆక్టివ్ ఉంటు తన ట్విట్లు, ఫొటోలతో చాలా మంది అభిమానులు, ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఆనంద్ మహీంద్ర తన సంస్థను విదేశాల్లో మరింతగా విస్తరిస్తూనే  మరోపక్క కొత్త సంస్థల్లో భాగస్వామ్యం, పెట్టుబడులకు కోసం ప్రయత్నిస్తున్నారు.

రెండేండ్ల క్రితం నెక్స్ట్‌-జెన్‌ ఇండియన్‌ సోషల్‌ నెట్‌వర్క్‌ స్టార్టప్‌ గురించి వర్కవుట్‌ చేయమంటూ మహీంద్ర ఎగ్జిక్యూటివ్‌ జస్ప్రీత్‌ బింద్రాను కోరారు. ఆ తరువాత 

బ్లాక్‌చెయిన్ సోషల్ మీడియా స్టార్టప్ అయిన హప్రాంప్‌లో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా 1 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.7.5కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు సిద్దమయ్యారు.

గురుగ్రవ్ ఆధారిత కంపెనీ అయిన హప్రాంప్ తన ఉత్పత్తి సమర్పణలో భాగంగా సృజనాత్మకత, యూజర్ ప్రైవసీ, డేటా సెక్యూరిటి, కంటెంట్ మోనటైజేషన్ వంటి పెద్ద సోషల్ మీడియా సవాళ్లపై పనిచేయడానికి ఈ సంస్థను నడిపిస్తున్నారు. 

also read  ఏటీఎంలలో తగ్గిన క్యాష్‌ విత్‌డ్రాలు..కానీ ఆన్ లైన్ పేమెంట్లు రెట్టింపు.. ...

నాకు 2 సంవత్సరాలు పట్టింది, కాని చివరికి నేను వెతుకుతున్న స్టార్టప్ కంపెనీ దొరికింది. ఈ స్టార్టప్ కంపెనీని రెండేండ్ల క్రితం వడోదర ఐఐటీ విద్యార్థులు  5 యువకులు స్థాపించారు అని ట్విట్టర్‌ ద్వారా ఆనంద్‌ మహీంద్రా తెలిపారు.

2018 లో ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న భారతీయ సోషల్ మీడియా స్టార్టప్‌కు మద్దతు ఇవ్వాలని చూస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆనంద్ మహీంద్రా సహకారంతో నెక్స్ట్-జెన్ ఇండియన్ సోషల్ నెట్‌వర్క్ స్టార్టప్ గా ఎదుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము అలాగే  ఆనంద్‌ మహీంద్ర లాంటి గొప్ప వ్యక్తి మమ్మల్ని గుర్తించినందుకు మాకెంతో గర్వకారణంగా ఉన్నది ఒక విధంగా మేమెంతగానో సంతోషిస్తున్నాం.

ఈ నిధులతో సంస్థను మరింత విస్తరించి మరిన్ని ప్లాట్‌ఫాంలను సిద్ధం చేస్తాం అని 'హప్రాంప్‌' సహా వ్యవస్థాపకుడు, సీఈవో శుభేంద్ర విక్రమ్‌ తెలిపారు. రాబోయే సంవత్సరంలో వాటిని మార్కెట్‌కు తీసుకెళ్లాలని హప్రాంప్ ఆశిస్తోంది అన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios