ప్రముఖ పారిశ్రామికవేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటాడు. అతని వద్దకు వచ్చిన ఆసక్తికరమైన, ఆశ్చర్యమైన విషయాలను వెంటనే షేర్ చేస్తుంటాడు. తాజాగా ట్విటర్ లో ఒక వీడియో షేర్ చేస్తూ  రైతు సోదరుల క్రియేటివిటీకి నేను అవాక్కయ్యను.  

బైక్‌లు, ట్రాక్టర్లను వివిధ యంత్రాలుగా మలుచుకునే వీడియోలు తరచూ తన దృష్టికి వస్తున్నాయి కానీ నేను ఎపుడూ ఊహించని టెక్నిక్ ఇందులో చూశానని  పేర్కొన్నారు. స్టాండ్ వేసివున్న బైక్ ను స్టార్ట్ చేసి గేర్ లో ఉంచి వెనుక చక్రాన్ని తిరుగుతున్నప్పుడు మొక్కజొన్న పొత్తులను దానికి ఆనించి పట్టుకోగా విత్తనాలన్నీ చాలా సులభంగా విడిపోతూ కింద పడుతున్నాయి.

also read ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింత సులభంగా.. ...

ఈ చక్రం తిరిగే వేగానికి పది సెకన్లలోపే ఓ మొక్కజొన్న కంకి నుంచి విత్తనాలను వేరు చేస్తున్నారు.కాంటినెంటల్ టైర్ బ్రాండ్ కు  ఇక ‘కార్న్’టినెంటల్ అనే ప్రత్యేక బ్రాండ్ ఉండాలేమో అంటూ చమత్కరించారు.

అయితే బైక్ టైర్ ద్వారా మొక్కజొన్నపొత్తు గింజలను సునాయాసంగా వొలుస్తున్న  వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. అంతకు ముందు హాండ్ సానిటైజర్, సింక్, పూల కుండీతో ఉన్న ఆటొ వీడియోని షేర్ చేశారు. ఇలా తన దృష్టికి వచ్చిన ఇంట్రెస్టింగ్ వీడియోలను అప్పటికప్పుడు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు.