రాఖీ పండగ సందర్భంగా తన చిన్న సోదరిని ఆటపట్టించిన ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్..ఏంటో చూసేయండి..
దేశవ్యాప్తంగా రాఖీ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా సోదర సోదరీమణులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని రాఖీ పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారతదేశంలోని దిగ్గజ కార్పొరేట్ కంపెనీ యజమానులు సైతం రాఖీ పండుగ వేడుకలను జరుపుకుంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేద ఆనంద మహీంద్రా ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ తన పోస్టులతో యూజర్లను ఆకట్టుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరిని గుర్తు చేసుకుంటూ తన చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ సోదరితో రాఖీ కట్టించుకుంటున్న ఫోటోను పోస్ట్ చేశారు ఈ సందర్భంగా తమ చిన్న సోదరి అనుజ ఆ ఫోటోలో లేకపోవడాన్ని ఆయన చమత్కారంగా పేర్కొన్నారు. తన పెద్ద సోదరి రాధిక తనకు రాఖీ కడుతున్న ఈ చిత్రంలో తన చిన్న సోదరి అనుజ లేదని అందుకు కారణం చెబుతూ ఆమె ఇంకా అప్పటికి పుట్టలేదని చమత్కరిస్తూ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు గతంలో తాను బ్లాక్ అండ్ వైట్ రంగులో పోస్టు చేశానని, ప్రస్తుతం కలర్ ఫోటో పోస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ దిగ్గజ కుటుంబాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నారు రిలయన్స్ వారసులు సైతం రాఖీ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ తన సోదరులు ఆకాశ అంబానీ అనంత అంబానీలకు రాఖీ కట్టినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ముఖేష్ అంబానీ సోదరి సైతం తన అన్నకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపింది.