న్యూ ఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు పెరుగుతూ ఉండటంతో మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్నేహితుడు అతనికి ఒక ఉత్తమమైన బహుమతిని ఇచ్చాడు. తన స్నేహితుడు అశోక్ కురియన్‌ బహుమతి ఇచ్చిన ఎన్95 కరోనా మాస్క్  గురించి ప్రశంశిస్తు ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని ట్వీట్ చేశాడు. ఈ మాస్క్ లివింగ్‌వార్డ్ తయారుచేసిందని ఆనంద్ మహీంద్రా తెలిపారు.

ఈ మాస్క్ ని ఉతికి శుభ్రం చేసుకోవచ్చు అలాగే ఇది వైరస్లను కూడా నాశనం చేయగలదు అని ఆయన అన్నారు. భారతదేశంలో కరోనావైరస్ సోకిన వారి సంఖ్య 78 కి చేరుకుంది. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు భారతదేశానికి ప్రయాణించే వారి  వీసాలను నిలిపివేసింది.

also read ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్...10వేల వరకు పెంపు....

వైరస్ సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్న కారణంగా జానా సంచారం ఉన్న సమావేశాలకు హాజరుకావద్దని ప్రజలను కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) క్రికెట్ మ్యాచ్‌లతో సహా క్రీడా కార్యక్రమాలలో 200 మందికి పైగా హాజరుకానున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, నియంత్రణ కొరకు ఢిల్లీ ప్రభుత్వం ఈ కార్యక్రమాలపై ప్రస్తుతం  నిషేధించింది. 

బెంగళూరులోని  గూగుల్ ఉద్యోగులలో ఒకరికీ కరోనావైరస్ పాజిటివ్   లక్షణాలు ఉన్నట్లు గూగుల్ ధృవీకరించింది. 26 ఏళ్ల ఈ వ్యక్తి ఇటీవల గ్రీస్ నుంచి ఇండియాకి వచ్చి కర్ణాటక రాజధానిలోని పలు ప్రదేశాలను సందర్శించినట్లు సమాచారం. అతడిని బెంగళూరు ఆసుపత్రిలో  ఉంచినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి బి శ్రీరాములు తెలిపారు. ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తులను, సన్నిహితులను కూడా గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

also read లాభాల్లో స్టాక్ మార్కెట్లు...భారీగా సెన్సెక్స్ రికవరీ...

 
భారతదేశంలో మొట్టమొదటి కరోనావైరస్ మరణం కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇటీవల సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన 76 ఏళ్ల ఇతను మంగళవారం మరణించాడు. అతని మరణం తరువాత అతనికి కరోనా వైరస్  ఉన్నట్లు నిర్ధారించారు.ఇటలీలోని విమానాశ్రయాలలో చిక్కుకున్న వందలాది మంది భారతీయులలో తెలుగు రాష్ట్రల నుండి చాలా మంది ఉన్నారు.