Asianet News TeluguAsianet News Telugu

డిక్షనరీ నుండి ఆ పదాన్ని బ్యాన్ చేయవచ్చా: ఆనంద్ మహీంద్రా

ఆనంద్ మహీంద్రా ఇంతకుముందు ఇంటి నుండి పనిచేస్తే ఉండే లాభాలు, నష్టాలను గురించి చెప్పారు, కాని ఒక వ్యాపారవేత్తకు పనిచేయడానికి  కోపం తెప్పించే ఒక అంశం కూడా ఉన్నట్లు అనిపిస్తుంది.
 

Anand Mahindra asks if it possible To Ban This Word from dictionary
Author
Hyderabad, First Published May 29, 2020, 6:05 PM IST

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా చేసిన ఒక ట్వీట్ కి వేలాది లైక్స్ వచ్చాయి. ఇంతకుముందు వర్క్ ఫ్రోం హోం చేస్తే ఉండే లాభాలు, నష్టాలను గురించి ట్వీట్ చేశారు, కాని ఒక వ్యాపారవేత్తకు పనిచేయడానికి  కోపం తెప్పించే ఒక అంశం కూడా ఉన్నట్లు తన ట్వీట్ ద్వారా అనిపిస్తుంది.

 కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్, సామాజిక దూరం వల్ల వర్చువల్ సెమినార్లు లేదా వెబ్‌నార్ ల ప్రజాదరణ గత కొన్ని వారాలుగా బాగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వర్క్ ఫ్రోం హోమ్ చేస్తున్నారు కరోనా వైరస్ మహమ్మారి మధ్య వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

"వెబ్‌నార్‌ నుండి నాకు మరో ఆహ్వానం వస్తే నాకు తీవ్రమైన ధీగ్బ్రంతి కలుగుతుంది" అని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.డిక్షనరీ నుండి "వెబ్‌నార్" అనే పదాన్ని నిషేధించాలని పిటిషన్ వేయవచ్చా అని ఆనంద్ మహీంద్రా తన 7.8 మిలియన్ల ట్విట్టర్ ఫాలోవర్స్ ని అడిగారు.

also read  విప్రో కొత్త సీఈవో, ఎండీగా థియరీ డెలాపోర్టే...జూన్‌ 6న కంపెనీ బాధ్యతలు

"ఈ పదం ఇటీవల ప్రవేశించినప్పటికీ  డిక్షనరీ నుండి దానిని బహిష్కరించాలని పిటిషన్ వేయడం సాధ్యమేనా?" అని అతను అడిగాడు. గత రాత్రి  ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ కి  దాదాపు 3,000 'లైక్స్' వచ్చాయి. అలాగే అతనితో తన ట్వీట్ ని అంగీకరిస్తు చాలా మంది కామెంట్స్ కూడా   చేశారు.

వాస్తవానికి, ట్విట్టర్ వినియోగదారులు కూడా ఆ పదానికి ప్రత్యామ్నాయా పదాలను కూడా సూచించటం ప్రారంభించారు అలాగే ఆనంద్ మహీంద్రా తన కుటుంబం నుండి "వెబ్‌నార్" స్థానంలో "కస్టమైజ్డ్ లేబుల్స్" తో వస్తున్నట్లు చెప్పారు. ఆనంద్ మహీంద్ర మరిన్ని సూచనలు అడుగుతూ ఒక ఉదాహరణ కూడా రాశాడు.

ఏప్రిల్‌లో ఆనంద్ మహీంద్రా వర్క్ ఫ్రోం హోం పై ఒక మేమే షేర్ చేస్తూ కన్ఫెషన్ కూడా చేశాడు. ఆ తరువాత, వర్క్ ఫ్రోం హోం చేసే వారి సంఖ్య పెరుగుతుందని  అతను ట్విట్టర్ లో స్పందించాడు."కరోనా వైరస్ లాక్ డౌన్ అనంతరం కూడా వర్క్ ఫ్రోం హోం ఉంటుందని నేను నమ్ముతున్నాను, కాని ఆఫీసులో పనిచేసి సంప్రదాయం ప్రధానంగా ఉంటుంది" అని ట్వీట్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios