Business Ideas: ఉన్న ఊరి నుంచి ఒక్క అడుగు బయట పెట్టకుండా 5 లక్షల పెట్టుబడితో నెలకు రూ. 1 లక్ష పక్కా ఆదాయం..

గ్రామీణ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసి కాలం వృధా చేసే కన్నా కూడా ఉన్న ఊరిలోనే మంచి వ్యాపారం చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మార్కెట్ కోసం ప్రత్యేకంగా వెతుక్కోవాల్సిన పనిలేదు. ఆన్లైన్ మార్కెట్ మీకు ప్రపంచ మార్కెట్ ను పరిచయం చేస్తుంది. దీని దృష్టిలో ఉంచుకొని మీరు గ్రామంలో ఉంటూనే చక్కటి బిజినెస్ ను ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం

An investment of 5 lakhs and an income of Rs 1 lakh per month MKA

మీరు ఉంటున్న ఊరిలోనే మంచి వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తున్నారా..చాలామంది గ్రామీణ యువత గ్రామంలో ఉపాధి లభించగా పట్టణాలకు వలస వెళ్తున్నారు. నిజానికి ఇలా వెళ్లడం వల్ల గ్రామాలు నష్టపోతున్నాయి. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను  సరిగ్గా ఉపయోగించుకుంటే, మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు, గ్రామాల్లో చాలా అవకాశాలు కూడా ఉన్నాయి.  ప్రస్తుతం ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  కేవలం 5 లక్షల రూపాయలు పెట్టుబడితో మీరు ప్రతి నెల ఒక లక్ష రూపాయల వరకు సంపాదించిన అవకాశం ఉంది. 

సాంప్రదాయ గానుగ నూనెలను  వంటల్లో ఉపయోగించుకునేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. . ప్రస్తుత కాలంలో కల్తీ నూనెలు ఎక్కువగా మార్కెట్లో అమ్ముడు అవుతున్నాయి ఈ నేపథ్యంలో సాంప్రదాయ గానుగ నూనెలను వంటల్లో ఉపయోగించాలని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు.  దీంతో చాలామంది ఇప్పుడు ఇప్పుడే ఆర్గానిక్ పద్ధతుల్లో సేకరించినటువంటి వంటనూనెలను వాడుతున్నారు.  దీన్నే మీరు ఒక అవకాశం గా మార్చుకోవచ్చు. 

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎద్దులు వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఉంటారు వాటి ద్వారా సాంప్రదాయ పద్ధతుల్లో గానుగ నూనె తీసినట్లైతే మీకు మంచి ఆదాయం లభించే అవకాశం ఉంది.  సాంప్రదాయ గానుగ పద్ధతుల్లో కాడేద్దులను గుండ్రంగా తిప్పుతూ మధ్యలో మర ఆడిస్తారు.  అందులో నువ్వులు కానీ వేరుశెనగ గింజలు కానీ,  పొద్దుతిరుగుడు గింజలు,  కుసుమ గింజలు,  ఆవగింజలు వేసి అందులోంచి నూనెను తీస్తారు.  ఇలా సాంప్రదాయ పద్ధతుల్లో తీసే కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వల్ల  ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి గానుగలను ఏర్పాటు చేసుకొని నూనెను ఉత్పత్తి చేసి నేరుగా కస్టమర్లకు విక్రయించినట్లయితే చక్కటి లాభం లభించే అవకాశం ఉంది.  నేరుగా కస్టమర్లను కాంటాక్ట్ అయ్యేందుకు సోషల్ మీడియా వేదికగా  ప్రచారం చేసే సరిపోతుంది.  ప్రస్తుత కాలంలో ప్రజలు ఆర్గానిక్ వస్తువులను వినియోగించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మీరు గానుగ నూనె బిజినెస్ ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. 

సాంప్రదాయ పద్ధతిలో గానుగను ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా ఒక షెడ్డును ఏర్పాటు చేసుకోవాలి. . అలాగే గానుగలో పనిచేసేందుకు పనివాళ్లను సైతం ఏర్పాటు చేసుకోవాలి. . దీంతోపాటు గానుగకు సంబంధించిన సామాగ్రిని సైతం తయారు చేయించుకోవాలి. . మొత్తానికి మూల పెట్టుబడి దాదాపు 5 లక్షల వరకు ఖర్చవుతుంది.  ఇక నూనె విషయానికి వచ్చినట్లయితే ఈ కోల్డ్ ప్రెస్ ఆర్గానిక్ ఆయిల్స్,  మార్కెట్లో లభించే నూనెల కన్నా కూడా ఎక్కువ ధరకు అమ్ముడు అవుతున్నాయి.  కావున మీకు లాభం కూడా ఎక్కువగా లభించే అవకాశం ఉంది. 

ముఖ్యంగా గానుగ నూనెలతో ఊరగాయలను పెట్టినట్లయితే మంచి రుచి లభిస్తుందని పాతతరం పెద్దలు చెబుతూ ఉంటారు.  అందుకే ఈ గానుగ నూనెలకు చాలా డిమాండ్ ఉంటుంది.  నిజానికి ఇండస్ట్రియలైజేషన్ కారణంగా చాలా వరకు గానుగలు మూతపడ్డాయి.  కానీ పెరుగుతున్న కల్తీ నూనెల వాడకం వల్ల మళ్ళీ గానుగులకు మంచి రోజులు వస్తున్నాయి.  మీరు మూలధనం పెట్టుబడి కోసం బ్యాంకు నుంచి ముద్ర రుణం కూడా పొందవచ్చు తద్వారా మీరు పెట్టుబడిని సులభంగా పొందే అవకాశం కలుగుతుంది. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios