అమెజాన్ చీఫ్ దాతృత్వం: పేదలకు ప్రీ స్కూళ్లు, ఇళ్లకు 200 కోట్ల విరాళం

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 14, Sep 2018, 8:24 AM IST
Amazon CEO Jeff Bezos launches a $2 billion philanthropic fund
Highlights

పంచంలోకెల్లా అభినవ సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ సీఈఓ జెఫ్ బోజోస్ తన దాతృత్వాన్ని ప్రకటించారు. ప్రారంభ దశలో నిరుపేదలకు కూడు,గూడు, అణగారిన వర్గాల పిల్లల ప్రీ స్కూళ్ల ఏర్పాటుకు రెండు బిలియన్ల డాలర్ల నిధిని ఏర్పాటు చేశారు. 

డిజిటల్ రిటైల్ మేజర్ అమెజాన్ డాట్ కాం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గురువారం ‘బెజోస్ డే వన్ ఫండ్’ ప్రకటించారు. అల్పాదాయ వర్గాలు, ఇల్లు లేని నిరుపేదల పిల్లలకు ప్రీ స్కూళ్ల కోసం ప్రారంభ దశలో 200 కోట్ల డాలర్ల నిధి కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధిని ‘డే 1 ఫ్యామిలీస్ ఫండ్’, ‘డే 1 అకడమిక్స్ ఫండ్’ మధ్య విభజిస్తున్నట్లు తెలిపారు. 

విరాళం నిధులిలా కేటాయింపు
‘డే 1 ఫ్యామిలీస్ ఫండ్‪ను వివిధ సంస్థలకు, సివిక్ గ్రూపులకు నాయకత్వ అవార్డులు ప్రదానం చేయడానికి కేటాయిస్తున్నాం. యువ కుటుంబాల తక్షణ అవసరాలు పరిష్కరించేందుకు, ప్రత్యేకించి కూడు, గూడు వసతి కల్పించడానికి కేటాయిస్తాం’ బెజోస్ ట్వీట్ చేశారు.

‘డే 1 అకడమిక్ ఫండ్ సాయంతో అణగారిన వర్గాల వారికి పూర్తిస్థాయి అత్యున్నత ప్రమాణాలతో కూడిన స్కాలర్ షిప్ కల్పిస్తూ మాంటిస్సొరీ స్ఫూర్తితో ప్రీ స్కూళ్లు ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయిస్తాం’ అని బెజోస్ తెలిపారు. అంతర్జాతీయంగా సంపన్నుల్లో 160 బిలియన్ల డాలర్లకు పైగా ఆదాయం కలిగిన మొదటి సంపన్నుడిగా ఫోర్బెస్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 

ఆఫ్‌లైన్ ప్రైం బెనిఫిట్ల పొడిగింపునకే మొగ్గు
అమెజాన్ ఇండియా తన వినియోగదారులకు ఆఫ్‌లైన్ బెనిఫిట్లను విస్తరించనున్నది. తరచూ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ వాడే వారికి ఇది వర్తిస్తుంది. భారతదేశంలోని చిన్న నగరాలకు, పట్టణాలకు సభ్యత్వాన్ని విస్తరించాలని నిర్ణయించామని అమెజాన్ ఇండియా గ్లోబల్ ప్రైం హెడ్ జమిలీ ఘనీ తెలిపారు.

ఇందుకోసం అమెజాన్ 50 లక్షల డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. గతేడాది ‘హోల్ ఫుడ్స్’ సంస్థను అమెజాన్ ఇండియా స్వాధీనం చేసుకున్నది. టోన్ టాగ్ వంటి పేమెంట్ సంస్థలతో కలిసి పని చేయనున్నది. ‘ఈట్ అండ్ గో’ ఆప్షన్ కింద వచ్చే 12 నెలల్లో తమ ప్రైమ్ సభ్యులకు 8000 రెస్టారెంట్ల పరిదిలో పేమెంట్ వెసులుబాటు కల్పిస్తుంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాకు కోటి మందికి పైగా సభ్యులు ఉన్నారు.

70% పెరుగనున్న కుబేరులు!
భారత్‌లో ఆదాయ అసమానతలు అంతకంతకు పెరుగుతు న్నాయి. దేశ సంపద పంపిణీ దిశగా ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టక పోతుండడంతో ఈ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది.

తాజా నివేదికల ప్రకారం దేశంలోని 1 శాతం మంది సంపన్నుల చేతుల్లో దేశంలోని దాదాపు 73 శాతం సంపద కేంద్రీకృతమై ఉండగా.. మిగతా 99 శాతం మంది ప్రజల దగ్గర కేవలం 27% సంపద కేంద్రీకృతమై ఉండడం దీనికి నిదర్శనం. ఇదిలా ఉండగా, భారత్‌లో కుబేరుల సంఖ్య 2022 నాటికి మరో 70 శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్టుగా 'నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా' సంస్థ తన నివేదికలో వెల్లడించింది.

2022 నాటికి కుబేరుల సంఖ్య 340 మంది?
దేశంలో 50 కోట్ల నుంచి వంద కోట్ల డాలర్లలోపు సంపద (అంటే రూ.3600 కోట్ల నుంచి రూ.72000 వరకు సంపద) కలిగి వారి సంఖ్య 2017లో 200లుగా నమోదు కాగా.. 2022 నాటికి ఈ సంఖ్య 340కి చేరనుందని 'నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా' సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. దాదాపు రూ. 3,600 కోట్ల నుంచి రూ.7,200 కోట్ల వరకు సంపద కలిగిన వారిని డెమిబిలియనీర్లుగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి డెమి బిలియనీర్లు మన దేశంలో ఎక్కువగా ఢిల్లీ, ముంబయిలలో ఉన్నట్టగా ఈ నివేదిక తెలిపింది.

loader