న్యూ ఢిల్లీ: నెట్‌వర్క్, డేటాబేస్, సర్వర్లు, చిప్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)విభాగాలను పటిష్ఠపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా 5,000 మందిని నియమించాలని యోచిస్తున్నట్లు అలీబాబా క్లౌడ్ మంగళవారం తెలిపింది.

అన్‌లైన్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాంలో ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన సంస్థల్లో ఆలీబాబా గ్రూప్ అగ్రస్థానంలో ఉంది. రానున్న రోజుల్లో సంస్థను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలుస్తున్నది. 

నెక్స్ట్ జనరేషన్ డేటాసెంటర్‌లను నిర్మించడానికి రాబోయే మూడేళ్లలో అదనంగా 28 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ ఏప్రిల్‌లో ప్రకటించింది.

"చైనాలో వ్యాపారాల కోసం డిజిటల్ పరివర్తన ప్రయాణం కోసం ఇంతకుముందు మూడు నుండి ఐదు సంవత్సరాలు పడుతుందని ఇప్పుడు ఒక సంవత్సరంలోపు పూర్తయ్యే అవకాశం ఉంది అని అలీబాబా క్లౌడ్ ఇంటెలిజెన్స్ అధ్యక్షుడు జెఫ్ జాంగ్ అన్నారు.

also read బ్యాంక్ కస్టమర్లకు షాకింగ్ న్యూస్...హోం లోన్స్ నిలిపివేత..

"అన్ని రంగాలలో గ్లోబల్ క్లయింట్ల నుండి డిజిటల్ షిఫ్ట్ వేగంగా పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా, ప్రపంచ స్థాయి క్లౌడ్ సేవలను అందించే మా నిబద్ధతతో మేము కొనసాగుతున్నాము" అని జాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు.

మెషిన్ ఇంటెలిజెన్స్, విజన్ కంప్యూటింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, హ్యూమన్-మెషిన్ ఇంటరాక్షన్, ఫైనాన్షియల్ టెక్నాలజీ వంటి రంగాలలో ప్రాథమిక సాంకేతిక పరిశోధన కోసం 2017 లో అలీబాబా డామో అకాడమీని స్థాపించింది.

గత కొన్నేండ్లుగా అలీబాబా డామో అకాడమీ నుంచి స్పీచ్‌ ఏఐ, ఇమేజ్‌ సెర్చ్‌, సిటి ఇమేజ్‌ అనలిటిక్స్‌ సహా పలు మార్గదర్శక సాంకేతికతలు ప్రపంచానికి అందించారు. ఇప్పటివరకు 63 జోన్లలో అలీబాబా క్లౌడ్‌ సేవల లభ్యత ఉండగా వీటిలో రెండు భారత్‌లో ఉన్నాయి. 21 ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు సేవలందిస్తున్నాయి.

చైనా ఇ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్  డేటా ఇంటెలిజెన్స్ వెన్నుముక్క అయిన అలీబాబా క్లౌడ్ ఏప్రిల్‌లో భారతదేశంతో సహా చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎస్‌ఎంఇ) సహాయం చేయడానికి 30 మిలియన్ల ప్రపంచ "యాంటీ-కోవిడ్" కార్యక్రమాన్ని ప్రారంభించింది.