ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారు, లైఫ్ సర్టిఫికేట్ (Annual Life Certificate) లేదా జీవన్ ప్రమాణ్, నవంబర్ 30, 2022లోపు సమర్పించాలి. పెన్షనర్లు తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని (Annual Life Certificate) డిజిటల్‌గా ఆరు మార్గాల్లో సమర్పించవచ్చు.

సీనియర్ సిటిజన్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ్ ప్రతి సంవత్సరం నవంబర్ 30 లోగా సమర్పించాలి. దీన్ని డిజిటిల్ పద్ధతిలో కూడ సబ్మిట్ చేయవచ్చు. బయోమెట్రిక్ సపోర్టుతో కూడిన ఈ డిజిటల్ సర్వీస్ ద్వారా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. ఆధార్ తో లింక్ చేసిన ఈ బయోమెట్రిక్ పద్ధతిని ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (DLC) ని సమర్పించవచ్చు.

సెప్టెంబరు 30, 2022న పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, పెన్షనర్లు 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌ల సహకారంతో డోర్‌స్టెప్ బ్యాంకింగ్ లేదా పోస్ట్స్ డిపార్ట్‌మెంట్ డోర్‌స్టెప్ సర్వీస్ ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు.

జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి
జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. పింఛనుదారులు జీవన్ ప్రమాణ్ యాప్‌ను పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలి. UIDAI నిర్దేశించిన పరికరాలను ఉపయోగించి ఒక పెన్షనర్ కూడా అతని/ఆమె వేలిముద్రలను సమర్పించవలసి ఉంటుంది. ఫింగర్ ప్రింట్ పరికరాన్ని మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ చేయడానికి OTG కేబుల్ ఉపయోగించవచ్చు. 

పోస్టాఫీసు ( ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ) ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి
నవంబర్ 2020లో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షనర్ల సంక్షేమం "పోస్ట్‌మ్యాన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి డోర్‌స్టెప్ సర్వీస్" కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించింది, దీనిని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అభివృద్ధి చేసింది. Google Play Store నుండి "Postinfo APP"ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. 

డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను ఎలా సమర్పించాలి
12 ప్రభుత్వ రంగ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్న PSB Alliance సంస్థ ద్వారా డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. దేశంలోని 100 ప్రధాన నగరాల్లోని తన కస్టమర్‌లకు "డోర్‌స్టెప్ బ్యాంకింగ్" అందిస్తుంది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సేకరణ సేవను PSB అలయన్స్ అందిస్తోంది. ఈ సేవను అందించడానికి ఒక డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఏజెంట్ పింఛనుదారుని ఇంటి వద్దకే వస్తారు. మొబైల్ యాప్, వెబ్‌సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్‌తో సహా అందుబాటులో ఉన్న మూడు ఛానెల్‌లలో దేనినైనా ఉపయోగించి పెన్షనర్ సేవను రిజర్వ్ చేసుకోవచ్చు. మొబైల్ యాప్ "డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (DSii)"ని Google Playstore నుండి డౌన్‌లోడ్ చేసుకొని కూడా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. 

ఫేస్ అథెంటికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి
UIDAI ఆధార్ సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ సిస్టమ్‌ను ఉపయోగించి పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్‌ను కూడా సమర్పించవచ్చు. ఈ పద్ధతిలో, పెన్షనర్ల లైవ్ ఫోటో తీయడం జీవన్ ప్రమాణ్ మొబైల్ అప్లికేషన్‌లో ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా ఏదైనా ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ నుండి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను రూపొందించవచ్చు.

ఇంట్లో పోస్ట్‌మ్యాన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలి
ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు పోస్టల్ డిపార్ట్‌మెంట్ నవంబర్ 2020లో పోస్ట్‌మెన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించడానికి డోర్‌స్టెప్ సేవను ప్రారంభించింది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి, పెన్షనర్ Google Playstore నుండి Postinfo యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.