రానున్న కాలంలో కస్టమర్ నుంచి నెలవారీ వచ్చే సరాసరి ఆదాయాన్ని(ARPU- Average Revenue From User) రూ. 200 లకు తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటన తరువాత ఎయిర్ టెల్ షేర్ ధర ఎన్ఎస్ఈ లో 1.55 శాతం పెరిగి రూ. 719.90 వద్ద ముగిసింది.
మరోసారి తన యూజర్లకు ఎయిర్ టెల్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలో మొబైల్ టారిఫ్ ధరలను పెంచనున్న సంకేతాలను సంస్థ వెలిబుచ్చింది. 2022 ఏడాదిలో ఒక యూజర్ నుంచి సగటు రాబడిని రూ.200 తీసుకోవాలని కంపెనీ భావిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో మొబైల్ టారిఫ్ ధర త్వరలోనే పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
రానున్న కాలంలో కస్టమర్ నుంచి నెలవారీ వచ్చే సరాసరి ఆదాయాన్ని(ARPU- Average Revenue From User) రూ. 200 లకు తీసుకువెళ్లనున్నట్లు వెల్లడించింది. ఈ ప్రకటన తరువాత ఎయిర్ టెల్ షేర్ ధర ఎన్ఎస్ఈ లో 1.55 శాతం పెరిగి రూ. 719.90 వద్ద ముగిసింది. గడచిన డిసెంబర్ త్రైమాసికంలో రూ. 830 కోట్లు నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 3 శాతం తక్కువ. ప్రస్తుతం సగటు వినియోగదారుని నుంచి నెలకు వస్తున్న సరాసరి ఆదాయం రూ. 163 గా ఉంది.
మూడో త్రైమాసికంలో బలమైన ఫలితాలు వచ్చాయని, ఇందుకు టారిఫ్ పెంపు, గూగుల్ పెట్టుబడులు సహా వివిధ కారణాలు అని భారతీ ఎయిర్‌టెల్ బుధవారం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరో టారిఫ్ పెంపు ఉండవచ్చునని సంకేతాలు ఇచ్చింది. వచ్చే మూడు నుండి నాలుగు నెలల కాలంలో పెంపు ఉండకపోయినా, ఈ ఏడాది ఉండవచ్చునని అంటున్నారు. ARPU ఈ ఏడాది చివరి నాటికి రూ.200కు పెరగవచ్చని సమాచారం.
ఈ ఏడాది ప్లాన్స్ చార్జీలను పెంచుతామనే సంకేతాలను సంస్థ తాజాగా ఇవ్వడం గమనార్హం. వచ్చే మూడు నాలుగు నెలల్లో పెంపు ఉండకపోయినా డిసెంబర్‌లోగా తప్పదని ఎయిర్‌టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ అన్నారు. ఈ క్రమంలో మొబైల్ కాల్, సర్వీసెస్ రేట్లను పెంచే అవకాశాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమలో ప్రత్యర్థి సంస్థల కంటే ముందుగా చార్జీలను పెంచేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారు.
ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి గాను మంగళవారం భారతీ ఎయిర్‌టెల్ తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఫలితాలపై బుధవారం గోపాల్ విఠల్ మాట్లాడారు. ఇప్పటికే పెంచిన చార్జీలు సంస్థకు కలిసి వచ్చాయన్నారు. ఇకపై ఈ తరహా లాభాన్ని వదులుకోలేమన్నారు. గత ఏడాది నవంబర్‌లో తొలుత చార్జీలను 18 శాతం నుండి 25 శాతం వరకు పెంచింది.
