Asianet News TeluguAsianet News Telugu

అండమాన్ నికోబార్ దీవులలో అల్ట్రా-ఫాస్ట్ 4జిని ప్రవేశపెట్టిన ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ అతి వేగవంతమైన ఇంటర్నెట్,  అల్ట్రా-ఫాస్ట్ 4జి నెట్‌వర్క్‌ను అండమాన్ అండ్ నికోబార్‌లలో ప్రారంభించింది.

Airtel Launches Ultrafast Internet in Andaman And Nicobar
Author
New Delhi, First Published Aug 24, 2020, 10:28 AM IST

ఎయిర్‌టెల్ అతి వేగవంతమైన ఇంటర్నెట్,  అల్ట్రా-ఫాస్ట్ 4జి నెట్‌వర్క్‌ను అండమాన్ అండ్ నికోబార్‌లలో ప్రారంభించింది. ఇంతకు ముందు ఇక్కడ హైస్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండేది కాదు. ఇంటర్నెట్ వినియోగంరోజురోజుకూ విస్తృతంగా పెరిగిపోతుంది. 

ఇంటర్నెట్, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది. వినోదం నుండివర్క్ వరకు, విద్య, బ్యాంకింగ్ కూడా ఇంటర్నెట్‌తోసులభతరం అవుతుంది. బిలియన్ల మంది వినియోగదారులతో 2020లో కమ్యూనికేషన్ కోసం ముఖ్యమైన సాధనాల్లో ఇంటర్నెట్ఒకటి.  ఎయిర్‌టెల్ మొట్టమొదటిసారిగామొబైల్ 4జిని 2014లో ప్రారంభించినప్పటి నుండి మనజీవితంలో ఒక విడదీయరాని భాగంగా మారింది. అదిలేకుండా ఒక రోజు ఊహించుకోవటం చాలా అసాధ్యం. 

అయితే మీరు అండమాన్ అండ్ నికోబార్దీవులలో నివసిస్తే, అది మీకు ఇంకోలా ఉంటుంది. ప్రధానభూభాగం నుండి ఇది దూరంగా ఉండటం కారణంగా, మన దగ్గరున్న ఇంటర్నెట్ అనుభవమంతా అక్కడ లేకుండా పోయింది.  4జి అందుబాటులో ఉన్నప్పటికీభారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలోలాగా అండమాన్ ద్వీపంలో ఇంటర్నెట్ సదుపాయం లేదు.ఇంటర్నెట్ వేగాన్ని గణనీయంగా పరిమితం చేసే వి‌ఎస్ఏ‌టి టెక్ ద్వారా అక్కడ 4జి సేవలు అందిస్తుండడం వల్ల వేగంచాలా పరిమితం.  

ఎయిర్‌టెల్ ఇటీవల అండమాన్ అండ్నికోబార్ దీవులలో అల్ట్రా-ఫాస్ట్ 4జిని లాంచ్ చేసింది, అక్కడ 4జి సేవలు అందించిన మొట్టమొదటి నెట్‌వర్క్ ప్రొవైడర్ గా ఎయిర్ టెల్  నిలిచింది.ఆగస్టు 10న ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగాప్రారంభించిన చెన్నై-అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ సముద్రగర్భ కేబుల్ సిస్టమ్ (CANI-SMCP) వల్ల ఇది సాధ్యపడింది. 

చెన్నై నుండి అండమాన్ దీవులకుసుమారు 2313 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భఆప్టికల్ ఫైబర్ కేబుల్ ను 1,224 కోట్ల ఖర్చుతో వేయడం జరిగింది. ఇది ఎయిర్‌టెల్ అల్డా ఫాస్ట్ 4జిని అండమాన్ నికోబార్ దీవులకుతీసుకురావడానికి వీలు కల్పించింది.  పోర్ట్ బ్లెయిర్ కాకుండా, స్వరాజ్ డీప్, లాంగ్ ఐలాండ్, రంగత్, లిటిల్ అండమాన్, కమోర్టా, కార్ నికోబార్, గ్రేటర్ నికోబార్ వంటి ఏడు ఇతరద్వీపాలకు కూడా ఈ కేబుల్ వేయబడింది. 

దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో నివసించేవారుఅనుభవిస్తున్న అల్ట్రా-ఫాస్ట్ 4జి సేవలను ఇప్పుడు  ఎయిర్‌టెల్ ఆ అన్ని ప్రయోజనాలనుఅండమాన్లలో నివసించే వారికి అందుబాటులోకి తీసుకువస్తుంది.  భారతదేశంలో ప్రతిఒక్కరికీ 4జి కనెక్టివిటీని తీసుకురావడంపైఎయిర్‌టెల్ దృష్టి సారించింది, 

ఈ కోణంలోవారు మంచి పురోగతే సాధిస్తున్నట్టుగా కనబడుతుంది. టెలిమెడిసిన్, నెట్-బ్యాంకింగ్, ఈ-లెర్నింగ్ వంటి వివిధ సేవలను పొందటానికి వీలుకల్పించే వేగవంతమైన ఇంటర్నెట్‌ను నివాసితులకు అందించడమే కాకుండా, స్థానిక పర్యాటకులు కూడా ఈ ద్వీపాలను సందర్శించేఅవకాశం ఉన్నందున ఇది స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుంది.  

వేగవంతమైన ఇంటర్నెట్‌తోనివాసితులకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలకు, ఆర్థిక వ్యవస్థకు మరింత సహాయపడుతుంది. ఎయిర్‌టెల్అధికారికంగా భారతదేశంలో అతిపెద్ద నెట్‌వర్క్ ప్రొవైడర్‌గా నిలిచింది, కారణం... ఎయిర్ టెల్ అన్ని సర్కిల్‌లలో సిగ్నల్ కవర్చేసే ఏకైక ప్రొవైడర్. అండమాన్ కు తీసుకువచ్చిన అల్ట్రా-ఫాస్ట్ 4జి శక్తితో, అండమాన్ నికోబార్ దీవులు డిజిటల్ విప్లవాన్ని తదుపరిస్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios