Asianet News TeluguAsianet News Telugu

Rules Change: విమాన ప్రయాణంలో ఇక ఈ వస్తువులను తీసుకెళ్లలేరు.. ఆఏంటో తెలుసా?

మీ దుబాయ్ విమానంలో చెక్-ఇన్ బ్యాగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో మీరు ఎం  ప్యాక్ చేయవచ్చు, ఎం ప్యాక్ చేయకూడదో తెలిసి ఉండాలి. మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్‌ని సందర్శించాలనుకుంటున్నట్లయితే, ఇది మీరు  తెలుసుకోవాల్సిన  వార్త. 

Airport Rules Change: You can't carry these items during flight.. Do you know what?-sak
Author
First Published Mar 30, 2024, 7:16 PM IST

విమానంలో  ప్రయానించేటప్పుడు ఎలాంటి వస్తువులను అనుమతించరో చాలా మందికి తెలియదు. అయితే, మీరు విమానంలో ప్రయాణించే ముందు అవేంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా దుబాయ్ వెళ్లే ప్రయాణికులు. మీరు దుబాయ్‌ని సందర్శించాలనుకుంటున్నట్లయితే, ఈ వార్త మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

సాధారణంగా, ప్రజలు క్యాబిన్ బ్యాగ్‌లో అవసరమైనయి  ముఖ్యంగా మందులు వంటి  వస్తువులను తీసుకెళ్లవచ్చు. అయితే ఇప్పుడు దుబాయ్ వెళ్లే విమానంలో ఇది సాధ్యం కాదు. అయితే అన్ని మందులు తీసుకెళ్లడం సాధ్యం కాదు. కానీ కొత్త నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న వస్తువులను మాత్రమే తీసుకెళ్లవచ్చు.

చాలా సార్లు  వారికీ  తెలియకుండానే అలాంటి వస్తువులను తమ వెంట విమానాల్లో తీసుకెళ్తారు, ఇది చట్టం ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. మీ దుబాయ్ విమానంలో చెక్-ఇన్ బ్యాగేజీతో పాటు క్యాబిన్ బ్యాగేజీలో మీరు ఎం  ప్యాక్ చేయవచ్చు, ఎం ప్యాక్ చేయకూడదో తెలిసి ఉండాలి. మీరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే దుబాయ్‌ని సందర్శించాలనుకుంటున్నట్లయితే, ఇది మీరు  తెలుసుకోవాల్సిన  వార్త. దుబాయ్‌ని సందర్శించేటప్పుడు అనుసరించాల్సిన నియమాలు చాలా ఉన్నాయి. మీరు మీ  బ్యాగులలో ఎలాంటి వస్తువులను తీసుకువెళుతున్నారో  జాగ్రత్తగా ఉండాలి.

నిషేధిత వస్తువులు: 

కొకైన్, హెరాయిన్, గసగసాలు(poppy seeds),  మత్తుమందులు.

తమలపాకులు, కొన్ని మూలికలను తీసుకోకూడదు.

ఏనుగు దంతాలు, ఖడ్గమృగం కొమ్ము, జూదం పరికరాలు, త్రీ-ప్లై ఫిషింగ్ నెట్‌లు, నిర్లక్ష్యం చేయబడిన దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువుల రవాణా కూడా నేరంగా పరిగణించబడుతుంది.

ప్రింటెడ్ మెటీరియల్స్, ఆయిల్ పెయింటింగ్స్, ఫోటోలు, పుస్తకాలు ఇక  రాతి శిల్పాలు కూడా అనుమతించబడవు.

నకిలీ కరెన్సీ, ఇంట్లో వండిన ఆహారం, మాంసాహారం కూడా తీసుకెళ్లలేరు.

నిషేధిత వస్తువులు రవాణా చేస్తున్నట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

డబ్బు కట్టి తీసుకెళ్లగల వస్తువులు:

మీ దుబాయ్ పర్యటనలో ముందస్తు డబ్బు చెల్లించి తీసుకెళ్లే  అవసరమయ్యే అనేక ఉత్పత్తులు ఉన్నాయి. ఈ లిస్టులో  మొక్కలు, మందులు, వైద్య పరికరాలు, పుస్తకాలు,    కాస్మెటిక్స్,  వైర్‌లెస్ పరికరాలు, ఆల్కహాలిక్ పానీయాలు, పర్సనల్ కేర్  ఉత్పత్తులు, ఇ-సిగరెట్లు ఇంకా ఎలక్ట్రానిక్ హుక్కా ఉన్నాయి.

తీసుకెళ్లకూడని  మందులు:

బీటామెథాల్(Betamethol)

ఆల్ఫా-మిథైల్ఫెనాన్‌(alpha-methylphenan)

గంజాయి

కోడెక్సిమ్(Codexyme)

ఫెంటానిల్(Fentanyl)

Poppy Straw Concentrate

మెథడోన్(Methadone)

ఓపీయం (Opium)

ఆక్సికోడోన్(Oxycodone)

ట్రైమెపెరిడిన్(Oxycodone)

ఫెనోపెరిడిన్(Phenoperidine)

కాథినోన్(Cathinone)

కోడైన్(Codeine)

అంఫేటమిన్(Amphetamine)

Follow Us:
Download App:
  • android
  • ios