న్యూ ఢీల్లీ: ఎయిర్‌ఏషియా ఇండియాలో 51 శాతం వాటా కలిగి ఉన్న టాటా సన్స్, అత్యవసరంగా 50 మిలియన్ డాలర్లను అందించనున్నట్లు సిద్ధంగా ఉంది. గత వారం మలేషియా క్యారియర్ ఎయిర్ ఏషియా టాటా సన్స్ భాగస్వామ్యంతో ఇండియా కార్యకలాపాలను సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

ఎయిర్‌ఏషియా గ్రూప్‌నకు మలేసియన్‌ భాగస్వామ్య సంస్థ నిధులను సమకూర్చడానికి విముఖత చూపుతున్న నేపథ్యంలో టాటా గ్రూప్‌ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.  గత నెలలో ఎయిర్ ఏషియా జపాన్ లో కార్యకలాపాలను మూసివేసింది.

టాటా సన్స్ పేరెంట్ ఎయిర్ ఏషియా గ్రూప్ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు గతంలో అనేక వార్తా కథనాలు వచ్చాయి.

టాటా సన్స్  ఈక్విటీ, రుణాల రూపంలో ఈ నిధులను అందించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశాయి. ఎయిర్ ఆసియా ఇండియాలో టాటా గ్రూప్ వాటా ప్రస్తుతం 51 శాతానికి మించి పెరుగుతుందని, ఈ విషయంపై అవగాహన ఉన్న కొందరు చెప్పారు.ఎయిర్‌ఏషియా నుంచి మలేషియన్‌ భాగస్వామి తప్పుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

also read ఇండియా ప్రపంచంలో పెట్టుబడుల ప్రధాన కేంద్రంగా మారవచ్చు: నిర్మల సీతారామన్ ...

అయితే ఎయిర్‌ఏషియాలో కొనసాగేందుకే టాటా గ్రూప్‌ ఆసక్తి చూపుతున్నట్లు సంబంధితవర్గాలు వెల్లడించాయి. ఎయిర్‌ఏషియాకు భవిష్యత్‌లో పెట్టుబడులను సమకూర్చగల భాగస్వామి కోసం టాటా గ్రూప్‌ చూస్తున్నట్లు తెలియజేశాయి.

దేశీయంగా విమానయాన రంగానికి సంబంధించి కోవిడ్‌-19ను పక్కనపెట్టి సాధారణ పరిస్థితులకు అనుగుణంగా టాటా గ్రూప్‌ ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించాయి. వెరసి మధ్యకాలానికి తిరిగి దేశీ విమానయాన రంగం జోరందుకోనున్నట్లు టాటా గ్రూప్‌ భావిస్తోంది. 

 ఎయిర్‌ఏషియా ఇండియా మార్కెట్‌ వాటా 7 శాతం, 3,000 మందికి పైగా ఉద్యోగులున్నారు, ఎఫ్‌వై 20లో 317 కోట్ల రూపాయల నష్టాన్ని నమోదు చేశారు. 2014లో ప్రారంభించినప్పటి నుండి ఎయిర్ ఏషియా ఇండియా నష్టాలను చవిచూస్తోంది.

టాటా సన్స్ ఎఫ్‌వై 20 నివేదికలో క్యారియర్ నికర విలువ పూర్తిగా క్షీణించిందని, దాని ఆడిటర్ జాయింట్ వెంచర్ గురించి ఆందోళనలను ఫ్లాగ్ చేసింది. అలాగే సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో ఫుల్-సర్వీస్ వైమానిక జాయింట్ వెంచర్‌గా ఉన్న విస్టారాలో టాటా గ్రూప్‌కు మెజారిటీ వాటా ఉంది. ఈ రెండు సంస్థలూ విస్తారాకు ఇటీవల రూ. 585 కోట్ల నిధులను అందజేశాయి.