న్యూ ఢీల్లీ: వందేభారత్ మిషన్ కింద విదేశాలలో చిక్కుకున్న భారతీయులను విమానాలలో స్వదేశానికి తీసుకురావడానికి వచ్చిన ఎయిర్ ఇండియా పైలట్లలో 60 మంది పైగా కరోనా వైరస్ సోకినట్లు ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలెట్స్ కమిటీ వెల్లడించింది.

విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించడానికి వందే భారత్ మిషన్  కింద నడిపిన విమానాలలో ఇప్పటి వరకు 60 పైగా పైలట్‌లకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది" అని జాతీయ క్యారియర్, సీనియర్-మోస్ట్ పైలట్లు పౌర విమానయాన మంత్రి హర్దీప్ పూరీకి రాసిన లేఖలో తెలిపారు.

పైలట్ల జీతాలను తగ్గించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ లేఖలో ఇది వారి కుటుంబ సభ్యులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది అని  పేర్కొన్నారు. పైలట్ల జీతం 75% వరకు తగ్గించెందుకు ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం వివక్షత, అసమానత, ఏకపక్షం ఎందుకంటే ఇది చాలా సార్లు పదేపదే నిరూపించబడింది అని సీనియర్ పైలట్లు హెచ్చరించారు.

పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన ఇతర విమానయాన సంస్థలులాగా కాకుండా, ఎయిర్ ఇండియాలోని ఏ ఉద్యోగి కూడా ఉద్యోగం కోల్పోరని ఎయిర్ లైన్స్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ ఇండియాకు సుమారు 70వేల కోట్ల రూపాయల అప్పు ఉంది.

also read 'ఇండియా ప్రపంచ దేశాల నమ్మకాన్ని సంపాదించింది' ...

ప్రభుత్వం విమాన సంస్థను విక్రయించడానికి ప్రయత్నిస్తోంది, కానీ ఇప్పటివరకు ఎటువంటి ఒప్పందం మూసివేయలేదు. భారతీయులను రక్షించడానికి ఎయిర్ ఇండియా పైలట్లు మొదట చైనా లోని వుహాన్ లోకి వెళ్లారు.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుండి భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి వందే భారత్ పథకం కింద విమానాలను నడుపుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న  7,73,000 మంది భారతీయులు తిరిగి వచ్చారు అని మంత్రి అన్నారు.

ఐదేళ్ల వరకు వేతనం లేకుండా కొంతమంది ఉద్యోగులను సెలవుపై పంపించాలన్న ఎయిర్‌ ఇండియా నిర్ణయాన్ని మంత్రి సమర్ధించారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా సవాలుగా ఉందని, కోవిడ్-19తో పోరాడటానికి ప్రయాణ ఆంక్షలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలను తీవ్రంగా దెబ్బతీశాయి.

భారతదేశంలోని అన్ని విమానయాన సంస్థలు వేతన కోతలు,  ఉద్యోగాల కోత వంటి ఖర్చు తగ్గించే చర్యలు కూడా తీసుకున్నాయి.