అమెరికన్ వాహన తయారీ సంస్థ టెస్లా భారతదేశంలోని బెంగళూరులో రిజిస్టర్డ్ కంపెనీగా అధికారికంగా ప్రవేశించింది. ఈ సంధర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్. యెడ్యురప్ప చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలోన్ మస్క్ కు స్వాగతం పలికారు.

అయితే దేశంలో ఆర్‌అండ్‌డి యూనిట్లను ఏర్పాటు చేయడానికి కార్ల తయారీ సంస్థ మరో ఐదు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. కర్ణాటక కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది.

ఈ ఏడాది జనవరి 8న టెస్లా మోటార్స్ ఇండియా అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశ ఐటి రాజధానిగా పిలువబడే బెంగళూరులో రిజిస్టర్డ్ కార్యాలయం ఏర్పాటు చేసింది.

ఎలోన్ మస్క్ యజమాన్యంలోని టెస్లా మోటార్స్ 2021లో భారతదేశంలోకి ప్రవేశిస్తుందని గత ఏడాది డిసెంబర్ 29న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ధృవీకరించారు. అలాగే ఈ సంస్థ 2021లో భారతదేశంలో తన కార్యకలాపాలను ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పారు.

డిమాండ్ ఆధారంగా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. అలాగే వచ్చే ఏడాది నుండి అంటే 2021 నుండి భారతదేశంలో తన కార్ల పంపిణీ సదుపాయాన్ని (సేల్స్ సెంటర్) కలిగి ఉంటుంది, ఇక్కడ డిమాండ్‌ను బట్టి తయారీని ఏర్పాటు చేయాలని పరిశీలిస్తుంది. రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిదారుగా అవతరించే అవకాశం భారత్‌కు ఉందని ఆయన అన్నారు.

also read  మహిళల కోసం రిలయన్స్ ట్రెండ్స్ సెల్ఫీ విత్ సంక్రాంతి ముగ్గు కాంటెస్ట్.. సెల్ఫి తీయండి గిఫ్ట్ పొందండి ...

ట్విట్టర్‌లో టెస్లా ఇండియా ప్రణాళికలపై అడిగిన ప్రశ్నకు ఎలోన్ మస్క్ సమాధానమిస్తూ " 2021లో టెస్లా కంపెనీ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని ప్రకటించారు"  అలాగే, టెస్లా సీఈఓ విషయానికొస్తే ఎలోన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, కానీ ఒకప్పుడు తన కారును రిపేర్ కోసం మెకానిక్ కి డబ్బు చెల్లించలేని పరిస్థితులను కూడా ఎదురుకొన్నాడు.

ఇటీవల ఒక ట్విట్టర్ యూజర్ దీనికి సంబంధించి ఎలోన్ మస్క్ పాత ఫోటోని షేర్ చేశాడు. అందులో ఎలోన్ మస్క్ తన  కారు విండోను ఫిక్సింగ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది.

కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, టెస్లా జనవరి 8న బెంగళూరులో 1.5 కోట్ల మూలధనంతో నమోదు చేసుకుంది. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ 142975. టెస్లా దర్శకులు వైభవ్ తనేజా, వెంకటరంగం శ్రీరామ్, డేవిడ్ జాన్ ఫెయిన్స్టెయిన్.

వైభవ్ తనేజా టెస్లా ఇండియా సిఎఫ్‌ఓ కాగా, ఫెన్‌స్టెయిన్ గ్లోబల్ సీనియర్ డైరెక్టర్. టెస్లా కంపెనీ మోడల్ 3 కార్లను భారతదేశంలో మొదట లాంచ్ చేయవచ్చు. డెలివరీలు ఈ  సంవత్సరం మొదటి త్రైమాసికం చివరిలో ప్రారంభమవుతుంది.

టెస్లా వార్షిక అమ్మకాలు 2020లో 36 శాతం పెరిగాయి. 2020లో 4,99,500 వాహనాలను పంపిణీ చేసినట్లు కంపెనీ తన నివేదికలో తెలిపింది. వీటిలో 180,570 స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్‌యూవీలు), అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సెడాన్లు ఉన్నాయి.

కరోనా వైరస్ మహమ్మారి మొదలయ్యే ముందు టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) ఎలోన్ మస్క్ 2020లో అర మిలియన్ వాహనాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ గత వారంలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగ  అవతరించాడు. అంతకుముందు అత్యంత ధనవంతుడిగా ఉన్న అమెజాన్  సి‌ఈ‌ఓ జెఫ్ బెజోస్ అధిగమించాడు. ఎలోన్ మస్క్ నికర విలువ యూ‌ఎస్ $ 188 బిలియన్లు దీనికి తోడ్పడింది. అయితే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్  నికర విలువ 187 బిలియన్ డాలర్లు. టెస్లా షేర్ ధర నిరంతరం పెరగడం వల్ల ఇది సహాయపడింది.