బిలయనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని  రిలయన్స్ రీటైల్ వెంచ‌ర్స్‌ లిమిటెడ్‌లో మరో సంస్థ భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్దమవుతుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) రిటైల్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఫేస్‌బుక్, ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ కెకెఆర్‌తో ప్రాథమిక చర్చలను ప్రారంభించింది.

ఈ రెండు సంస్థలు ఇప్పటికే ఆర్‌ఐఎల్ జియో ప్లాట్‌ఫామ్‌లలో వాటాను కలిగి ఉన్నాయి. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో కెకెఆర్ సుమారు  1.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం.  

also read గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా.. ? ...

రెండు సంస్థల మధ్య చర్చలు ప్రారంభంలో ఉన్నందున ఈ నెలలోగా ఒక ప్రకటన రావచ్చు అని పేర్కొంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఆని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్‌ఆర్‌విఎల్)లో 1.75 శాతం వాటాను  7,500 కోట్లకు తీసుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ రోజు ప్రకటించింది.

అంతకుముందు  ఈ ఏడాది ఆరంభంలో సిల్వర్ లేక్ 1.35 బిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డి జియోలో పెట్టిన సంగతి మీకు తెలిసిందే.