భారతదేశం 50కి పైగా చైనా యాప్‌లను నిషేధించిన తరువాత, టిక్‌టాక్‌తో సహా చైనా సోషల్ మీడియా యాప్‌లను నిషేధించాలని అమెరికా చూస్తోందని విదేశాంగ కార్యదర్శి వెల్లడించారు. ఆగ్రా రాజ్యం  అయిన అమెరికా కూడా ఇప్పుడు ఇండియాని అనుసరించనుంది.

టిక్‌టాక్‌తో సహా చైనా సోషల్ మీడియా యాప్‌లను ఖచ్చితంగా నిషేధించడానికి అమెరికా చూస్తోందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపీ చెప్పారు.
 "భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత, ప్రజల భద్రత" వంటి కార్యకలాపాలకు భంగం కలిగించేలా చైనా లింకులతో ఉన్న 59 యాప్ లను భారత ప్రభుత్వం జూలై మొదటి వారంలో నిషేధించింది. భారత్, చైనా సరిహద్దుల మధ్య జరిగినా ఘర్షణల నేపథ్యంలో ఈ నిషేధం వచ్చింది. 


మొత్తం 59 యాప్స్ ఇప్పుడు భారత మార్కెట్ ఆపిల్ ఇంక్, గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించబడ్డాయి. చైనా యాప్స్ నిషేధించాలన్న భారతదేశ నిర్ణయాన్ని  అమెరికాలో విస్తృతంగా గుర్తించబడింది, దీంతో కొంతమంది ప్రముఖ చట్టసభ సభ్యులు, అమెరికన్ ప్రభుత్వాన్ని దీనిని అనుసరించాలని కోరారు.

also read చైనాకు హీరో సైకిల్స్ షాక్.. హువావేపై బ్యాన్‌.. ...

"చైనా, భారతదేశ సరుహద్దులలోని గాల్వాన్ లోయలో ఘోరమైన ఘర్షణ నేపథ్యంలో టిక్ టాక్ సహ డజన్ల కొద్దీ ఇతర చైనా యాప్స్ ని భారతదేశం నిషేధించింది" అని రిపబ్లికన్ సెనేటర్ జాన్ కార్నిన్ ఒక ట్వీట్‌లో ఈ వార్తా నివేదికను ట్యాగ్ చేశారు.

చైనా ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసం టిక్‌టాక్‌ను ఉపయోగిస్తోందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ ఆరోపించారు. బీజింగ్ లోని ఒక మీడియా నివేదిక ప్రకారం చైనా టెక్ దిగ్గజం యునికార్న్ బైట్ డాన్స్ లిమిటెడ్ టిక్ టాక్ సహా మూడు యాప్ లను భారతదేశంలో నిషేధించిన తరువాత 6 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్నికలిగినట్లు అంచనా వేసింది.

భారతదేశం నిషేధించిన అన్ని ఇతర చైనా యాప్స్ నష్టాల కంటే ఎక్కువగా టిక్ టాక్ సహా మూడు యాప్ లకు నష్టం ఉంటుందని చైనా కైక్సింగ్లోబల్.కామ్ నివేదించింది.