టిక్‌టాక్‌ నిషేధం తర్వాత టెక్నాలజీ దిగ్గజం అలీబాబా వంటి చైనా కంపెనీలపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. అలీబాబా వంటి చైనా కంపెనీలతో పాటు చైనా యాజమాన్యంలోని ఇతర ప్రత్యేక సంస్థలు కూడా నిషేధానికి ఉన్నాయా అని ఒక ప్రెస్ మీట్ సమావేశంలో అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

షార్ట్-వీడియో యాప్ టిక్‌టాక్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధిస్తామని ప్రమాణం చేసిన తరువాత చైనా యాజమాన్యంలోని ఇతర సంస్థలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

also read టిక్‌టాక్‌ పై ట్రంప్ కొత్త నిర్ణయం.. బైట్‌డాన్స్‌కు మరో 45 రోజులు గడువు ...

టిక్‌టాక్  యుఎస్ కార్యకలాపాలను 90 రోజుల్లోపు విక్రయించాలని యునైటెడ్ స్టేట్స్ బైట్‌డాన్స్‌ను శుక్రవారం ఆదేశించింది. గత ఏడాది చివర్లో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా సోయాబీన్స్, మొక్కజొన్న వంటి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని ప్రశంసించారు.

అమెరికాలో టిక్‌టాక్‌ వ్యాపారాన్ని ఏదేని అమెరికా కంపెనీకి విక్రయించాలని, లేదంటే నిషేధం తప్పదని బైట్‌డాన్స్‌కు తేల్చి చెప్పారు. ఈ మేరకు విధించిన  45 రోజుల గడువును 90 రోజులకు పెంచుతూ ఇటీవల ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి  తెలిసిందే.