. "బైట్ డాన్స్ యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రతకు హాని కలిగించే అవకాశం ఉందని నమ్మదగిన ఆధారాలు ఉన్నాయి" అని ట్రంప్ అన్నారు. దీని ఆధారంగా దేశ ప్రయోజనాలకు, భద్రతకు ముప్పుగా మారిన టిక్‌టాక్ పై చర్య తీసుకునే అవకాశం ఉందని నమ్ము తున్నానంటూ ఆగస్టు 14 న  జారీ చేసిన ఉత్తర్వుల్లో ట్రంప్ పేర్కొన్నారు.

వాషింగ్టన్: వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ కార్యకలాపాలను విక్రయించేందుకు బైట్‌డాన్స్‌కు మరో 45 రోజులు గడువు ఇచ్చారు. ఈ మేరకు కొత్త ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.

 "బైట్ డాన్స్ యునైటెడ్ స్టేట్స్ జాతీయ భద్రతకు హాని కలిగించే అవకాశం ఉందని నమ్మదగిన ఆధారాలు ఉన్నాయి" అని ట్రంప్ అన్నారు. దీని ఆధారంగా దేశ ప్రయోజనాలకు, భద్రతకు ముప్పుగా మారిన టిక్‌టాక్ పై చర్య తీసుకునే అవకాశం ఉందని నమ్ము తున్నానంటూ ఆగస్టు 14 న జారీ చేసిన ఉత్తర్వుల్లో ట్రంప్ పేర్కొన్నారు.

also read అందుకే ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఈ వీడియో చూస్తా: ఆనంద్ మహీంద్రా ...

గత వారం ట్రంప్ బైట్‌డాన్స్‌ యు.ఎస్ లావాదేవీలను నిషేధించే ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులను జారీ చేశారు. టిక్ టాక్ అమెరికన్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి మైక్రోసాఫ్ట్ చేసిన ప్రయత్నానికి తాను మద్దతు ఇస్తానని ట్రంప్ చెప్పారు.

ఇచ్చిన గడువులోగా అమెరికాలోని ఏదేని పెద్ద సంస్థకు టిక్‌టాక్ కార్యకలాపాలను విక్రయించాలి లేదంటే నిషేధం తప్పదని హెచ్చరించారు. ఈ కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం 90 రోజుల గడువు లోపల టిక్‌టాక్‌ను ఏదైనా అమెరికా సంస్థ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

దీనికి నవంబర్, 12తో కొత్త గడువు ముగియనుంది. ఇప్పటివరకు ఈ గడువు సెప్టెంబరు 15 వరకు మాత్రమే.