అమెజాన్ వ్యవస్థాపకులు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన జెఫో బెజోస్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నరనే వార్త అందరికీ తెలిసే ఉంటుంది. సుమారు పాతికేళ్ల పాటు కలిసి ఉన్న జంట ఇప్పుడు సడెన్ గా విడాకులు తీసుకోవడానికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.

జెఫో బెజోస్.. తన స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారట. అందుకే ఆయన భార్య విడిపోలాని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జెఫో బెజోస్.. గత కొంతకాలంగా స్నేహితుడి భార్య లారెన్ సాంచెజ్(49) తో డేటింగ్ లో ఉన్నారు. ఆమె గతంలో న్యూస్ యాంకర్ గానూ, హెలికాప్టర్ పైలెట్ గానూ, డ్యాన్స్ షోకి హోస్ట్ కాగా వ్యవహరించారు. కొన్ని హాలివుడ్ సినిమాల్లోనూ నటించారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 

ఆమె తన భర్త నుంచి విడిపోయాక జెఫో బెజోస్ తో డేటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. నేషనల్ ఎంక్వైరర్ తెలిపిన వివరాల ప్రకారం.. బెజోస్..  తన ప్రియురాలికి ప్రేమ సందేశాలు పంపినట్లు తెలిపింది. ‘‘ నేను గట్టిగా పట్టుకోవాలని ఉంది.. నీ పెదాల పై ముద్దు పెట్టాలని ఉంది.  నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ అంటూ మెసేజ్ లు చేశారట. 

అందుకే.. ఈ వయసులో బెజోస్ భార్యకు విడాకులు ఇస్తున్నారు. ఈ విడాకుల వల్ల జెఫ్ తన ఆస్తిలో సగం అంటే దాదాపు 62.15 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 4.2 లక్షల కోట్లు) భార్య మెకంజీకి భరణంగా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రపంచ చరిత్రలో ఇంత భారీగా మనోవర్తి తీసుకోనున్న మహిళగా మెకంజీ రికార్డుల్లోకి ఎక్కనున్నారు.