Asianet News TeluguAsianet News Telugu

మీ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేయాల.. అయితే ఇలా చేయండి.. మీ డబ్బు, సమయం రెండు ఆదా.

ప్రస్తుతం ఆధార్ అప్ డేట్ కూడా ఇప్పుడు అందుబాటులో లేదు, కానీ మొదట ఆధార్ అప్ డేట్  కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితిలో ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించే బదులు, మీరు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకొని అప్‌డేట్ కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళడం మంచిది. 

adharcard update book appointment at aadhar seva kendra know full process-sak
Author
Hyderabad, First Published Oct 5, 2020, 4:37 PM IST

మీరు ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే, ఇప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్ లేదా ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆధార్ అప్ డేట్ కూడా ఇప్పుడు అందుబాటులో లేదు, కానీ మొదట ఆధార్ అప్ డేట్  కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.

కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితిలో ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించే బదులు, మీరు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకొని అప్‌డేట్ కోసం ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళడం మంచిది. ఇలా చేయడం వల్ల మీ డబ్బు ఇంకా సమయం ఆదా అవుతుంది. అంతే కాదు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది

ఆధార్ కార్డు అప్ డేట్, కొత్త రిజిస్ట్రేషన్ల కోసం ఢీల్లీ, బెంగళూరు, ముంబై, లక్నో, చెన్నైతో సహా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఉన్నాయి.

also read ముకేష్ తో డేట్ కు వెళ్తారా: నీతా అంబానీని అడిగితే ఏం చెప్పిందో తెలుసా.. ...

ఏదైనా మీకు దగ్గరలోని ఆధార్ సేవా కేంద్రంలో ఆధార్ కార్డు అప్ డేట్ కోసం అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవడానికి మీరు https://appointments.uidai.gov.in/ ని సందర్శించాలి. ఇక్కడ మీరు మై ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. డ్రాప్ డౌన్ లో ఇచ్చిన ఆప్షన్స్ నుండి బుక్ అపాయింట్మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, మీరు మొదట మీ నగరం లేదా ప్రదేశాన్ని ఎంచుకోవాలి. దీని తరువాత మీరు క్రింద ఉన్న బుక్ అపాయింట్మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజీలో  రెండు ఆప్షన్స్ ఉంటాయి. 1. ఆధార్ అప్ డేట్ 2. కొత్త ఆధార్.

ఇప్పుడు మీరు ఆధార్ అప్ డేట్ లేదా రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు ఆధార్ అప్ డేట్ ఎంచుకుంటే మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఆధార్ నంబర్, ఆధార్ లోని పేరు, ఆధార్ సేవా కేంద్రాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.

దీని తరువాత వ్యక్తిగత వివరాలను నింపాలి. అప్పుడు టైమ్ స్లాట్ ఎంచుకోవలసి ఉంటుంది, ఆపై అపాయింట్‌మెంట్ వివరాలు మీ ముందు కనిపిస్తాయి, దానిపై మీ బుకింగ్ ఓకే అవుతుంది. తారువత మీరు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్ళి వెంటనే అప్‌డేట్ చేయవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios