Asianet News TeluguAsianet News Telugu

పనాసియా బయోటెక్ నుండి అదార్ పూనవల్లా ఔట్.. మొత్తం వాటాను రూ.118 కోట్లకు విక్రయం..

 సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనవల్లా పనాసియా బయోటెక్‌లో తన వాటాను విక్రయించారు. ఈ డీల్ మొత్తం విలువను రూ .118.02 కోట్లు.

Adar Poonawalla exits Panacea Biotec, sells entire stake for Rs 118 crore to SII
Author
Hyderabad, First Published May 18, 2021, 11:34 AM IST

న్యూ ఢీల్లీ: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవల్లా, పనాసియా బయోటెక్‌లో తన మొత్తం వాటాను  5.15 శాతం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా  విక్రయించారు.

ఈ వాటాలను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) పొందినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.

బిఎస్‌ఇ బ్లాక్ డీల్ డేటా ప్రకారం అదార్ పూనవల్లా సంస్థలో తన వద్ద ఉన్న 31,57,034 స్క్రిప్ట్‌లను ఒక్కో షేరుకు రూ .373.85 చొప్పున విక్రయించారు. ఈ డీల్ మొత్తం విలువను రూ .118.02 కోట్లు. ప్రత్యేక లావాదేవీల ద్వారా షేర్లను అదే ధరకు ఎస్‌ఐ‌ఐ  సొంతం చేసుకుంది.

మార్చి 2021 త్రైమాసికంలో వాటాదారుల డేటా ప్రకారం అదార్ పూనవల్లా ఇంకా ఎస్‌ఐ‌ఐ  ఇద్దరు సంస్థలో స్టేక్ హోల్డర్స్  అలాగే పనాసియాలో పూనవల్లాకి  5.15 శాతం, ఎస్‌ఐ‌ఐకి  4.98 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

పనాసియా బయోటెక్ షేర్లు సోమవారం రూ .384.9 వద్ద ముగిశాయి, అంతకుముందుతో పోలిస్తే ఇది 1.16 శాతం ఎక్కువ.

జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌లో సర్దా మైన్స్ రూ .227.66 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. 52.74 లక్షలకు పైగా స్క్రిప్స్‌ను ఒక్కొక్కటి రూ .431.62 ధర వద్ద ఆఫ్‌లోడ్ చేశారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ స్టాక్ సోమవారం 4.65 శాతం పెరిగి రూ .436.55 వద్ద ముగిసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios