Adani Wilmar: తగ్గేదేలే అంటున్న అదానీ విల్మర్, FMCG వ్యాపారంలో హిందుస్తాన్ యూనిలివర్‌ను దాటేసింది...

వరుస విజయాలతో దూసుకెళ్తున్న అదానీ గ్రూప్, మరో అరుదైన ఘనత సాధించింది. ఈ గ్రూపునకు చెందిన అదానీ విల్మర్ తాజాగా దేశీయంగా నెంబర్ వన్ FMCG సంస్థగా నిలిచింది. దశాబ్దాల పాటు ఈ స్థానంలో కొనసాగిన హిందుస్తాన్ యూనిలివర్ ను అదానీ విల్మర్ తోసిరాజైంది.  
 

Adani Wilmar pips hindustan unilever to become largest indian fmcg company

అదానీ గ్రూప్‌కు చెందిన ఎఫ్‌ఎంసిజి కంపెనీ అదానీ విల్మార్ (Adani Wilmar) మరో రికార్డును నెలకొల్పింది. అదానీ విల్మార్ (Adani Wilmar) ప్రస్తుతం  హిందుస్థాన్ యూనిలీవర్‌ను అధిగమించి దేశంలోనే అతిపెద్ద FMCG కంపెనీగా అవతరించింది. అదానీ విల్మర్ గత ఆర్థిక సంవత్సరం (FY22)లో కార్యకలాపాల ద్వారా రికార్డు ఆదాయాన్ని పొందారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అదానీ విల్మార్ (Adani Wilmar) ఆదాయం ఏడాది ప్రాతిపదికన 46.2 శాతం పెరిగింది.

హిందుస్థాన్ యూనిలీవర్ ను దాటేసిన అదానీ విల్మార్ (Adani Wilmar)
గత ఆర్థిక సంవత్సరంలో ఎడిబుల్ ఆయిల్స్ విభాగం నుంచి అదానీ గ్రూప్ భారీగా లాభపడింది. ఈ ఏడాది కంపెనీ రూ.54,214 కోట్ల వార్షిక ఆదాయాన్ని పొందింది.  మరోవైపు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో హిందుస్థాన్ యూనిలీవర్ ఆదాయం రూ.51,468 కోట్లు నమోదు చేసింది. ఈ విధంగా చాలా కాలంగా మొదటి స్థానంలో ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్ అదానీ విల్మార్ (Adani Wilmar)ను వెనక్కి నెట్టింది. ఇదిలా ఉంటే  సరిగ్గా ఏడాది క్రితం అంటే అదానీ విల్మర్  2020-21 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ. 37,090 కోట్లుగా ఉంది.

ఎడిబుల్ ఆయిల్ వ్యాపారం అదృష్టాన్ని మార్చింది
అదానీ విల్మార్ (Adani Wilmar) ఎడిబుల్ ఆయిల్ వ్యాపారం నుండి అత్యధికంగా లాభపడింది. ఈ వ్యాపారం మాత్రమే గత ఆర్థిక సంవత్సరంలో విల్మార్ ఆదాయంలో 84 శాతం అందించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విల్మార్ ఎడిబుల్ ఆయిల్స్ అమ్మకాలు రూ. 30,818 కోట్లుగా ఉన్నాయి. ఇది ఏడాది తర్వాత 47.3 శాతం పెరిగి రూ. 45,401 కోట్లకు చేరుకుంది. ఇండస్ట్రీ ఎస్సెన్షియల్స్ వ్యాపారం ద్వారా కంపెనీ తన ఆదాయంలో దాదాపు 11.4 శాతం వాటాను పొందుతోంది. ఈ విభాగంలో విక్రయాలు ఏడాది క్రితం రూ.4,366 కోట్లతో పోలిస్తే 42 శాతం పెరిగి రూ.6,191.5 కోట్లకు పెరిగాయి.

ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారం ఇప్పటికీ నష్టాల్లోనే ఉంది
అదానీ విల్మార్ (Adani Wilmar) ఇటీవల ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఈ విభాగం ఇప్పటికీ లాభాలను ఆర్జించలేదు, కానీ దాని ఆదాయం 38 శాతం పెరిగింది. అదానీ విల్మార్ (Adani Wilmar) ప్యాకేజ్డ్ ఫుడ్ వ్యాపారం గత ఆర్థిక సంవత్సరంలో రూ. 22.5 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఈ వ్యాపారం  ఆదాయం ఏడాది క్రితం రూ.1,905.6 కోట్ల నుండి రూ.2,621.3 కోట్లకు పెరిగింది.

కోహినూర్‌ (Kohinoor) బాస్మతి బ్రాండ్ సొంతం చేసుకున్న అదానీ విల్మర్..
ఇదిలా ఉంటే, ప్యాకేజ్డ్ ఫుడ్ విభాగంలో తన ఆధిపత్యాన్ని పెంచేందుకు అదానీ విల్మార్ (Adani Wilmar) సరికొత్త డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్‌లో అదానీ విల్మార్ (Adani Wilmar), అమెరికన్ కంపెనీ మెక్‌కార్మిక్ నుండి ప్యాకేజ్డ్ ఫుడ్ బ్రాండ్ కోహినూర్‌ (Kohinoor)ను కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్ ఎంత వరకు జరిగిందనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ డీల్‌లో అదానీ అమెరికన్ కంపెనీకి చెందిన ప్రీమియం బాస్మతి రైస్ బ్రాండ్‌ను పొందడమే కాకుండా, చార్మినార్, ట్రోఫీ వంటి  బ్రాండ్‌లు కూడా సొంతం చేసుకుంది.  ప్రస్తుతం ఈ బ్రాండ్ల విలువ కలిపి దాదాపు రూ.115 కోట్లు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios