Asianet News TeluguAsianet News Telugu

అదానీ ఈజ్ బ్యాక్...ఒక్కరోజులోనే రూ. 3553 కోట్లు సంపాదించి, బ్లూంబర్గ్ బిలియనీర్ల జాబితాలో సరికొత్త రికార్డు..

ఎంత వేగంగా అదానీ సంపద కరిగిపోయిందో అంతే వేగంగా బౌన్స్ బ్యాక్ అవుతోంది. దీనికి సంబంధించి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ఆయన సంపద వేగంగా పెరిగినట్లు తెలుస్తోంది. గౌతమ్ అదాని ఒక్కరోజులోనే నాలుగు బిలియన్ డాలర్లు సంపాదించి రియల్ టైం బిలియనీర్స్ ఇండెక్స్ లో అగ్రస్థానంలో నిలిచారు.

Adani is back In one day  Earning 3553 crores a new record in the list of billionaires MKA
Author
First Published Feb 9, 2023, 6:13 PM IST

అదానీ గ్రూప్‌ కృత్రిమంగా షేరు ధరలను పెంచుతోందనే ఆరోపణలతో అమెరికా పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్‌ గత నెలలో ఓ నివేదికను ప్రచురించింది. ఆ తర్వాత అదానీ కంపెనీ షేర్లు భారత స్టాక్ మార్కెట్‌లో మరెన్నడూ లేని విధంగా పడిపోయాయి. గౌతమ్ అదానీ  సంపదపై ఈ  ప్రభావం కారణంగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోని టాప్ 20 ధనవంతుల జాబితా నుండి కూడా తప్పుకున్నాడు.

కంపెనీ షేర్లు దారుణంగా పడిపోవడంతో కంపెనీ 100 బిలియన్ డాలర్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. కేవలం 10 రోజుల్లో అదానీ సామ్రాజ్యం కుప్పకూలింది. 2023 ప్రారంభం నుంచి చూస్తే అదానీ సంపద 130 బిలియన్ యుఎస్ డాలర్లు కోల్పోయింది. అయితే హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత 10 రోజుల్లోనే అతని సంపద 58 బిలియన్ యుఎస్ డాలర్లకు పడిపోయింది.

బ్లూమ్‌బెర్గ్‌లోనే కాకుండా ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో కూడా అదానీ 2వ స్థానం నుంచి 22వ స్థానానికి పడిపోయారు. అయితే అనూహ్యంగా అదానీ తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించారు. దీంతో బిలియనీర్ల జాబితాలో మళ్లీ పురోగతి ప్రారంభమైంది.

బుధవారం, అదానీ ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో ఒకే రోజు అత్యధిక సంపద పొందిన వ్యక్తి అయ్యాడు. అంతేకాదు, ఫోర్బ్స్ బిలియనీర్ లిస్ట్‌లో ఒక్కరోజులో ఇంత మొత్తంలో సంపదను ఆర్జించిన మొదటి వ్యక్తి కూడా అదానీయే అవడం విశేషం.

టాప్ ఫోర్బ్స్ విజేతల జాబితా:
బుధవారం ఫోర్బ్స్ విజేతల జాబితాలో గౌతమ్ అదానీ అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్, ప్రపంచంలోని అత్యంత సంపన్నులు ప్రతిరోజూ ఎంత సంపదను కూడగట్టారు అనే దాని ఆధారంగా జాబితాను అప్‌డేట్ చేస్తుంటారు. ఫిబ్రవరి 8న గౌతమ్ అదానీ ప్రపంచంలోనే అత్యధికంగా సంపదను పోగుచేసిన వ్యక్తిగా నిలిచాడు.

గౌతమ్ అదానీ బుధవారం తన సంపదలో 4.3 బిలియన్ అమెరికన్ డాలర్లను ఒకేరోజులో చేర్చుకున్నారు. అంటే అదానీ సంపద ఒక్కరోజులోనే 3553 కోట్ల రూపాయల మేర పెరిగింది. దీంతో అతని నికర విలువ 64.9 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నారు. అయితే ఈ లిస్టులో అదానీ తర్వాత ఎలాన్ మస్క్ రెండో స్థానంలో ఉన్నాడు. క్లాస్-మిచెల్ కుహెన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. బుధవారం ఒక్కరోజే ఆయన సంపద 1.9 బిలియన్ అమెరికన్ డాలర్లు పెరిగింది.

నాలుగో స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ, నష్టపోయిన లారీ పేజ్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నాలుగో స్థానంలో ఉన్నారు. ఒక్కరోజులోనే ఆయన సంపద 1.6 బిలియన్ డాలర్లు పెరిగింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ యజమాని లారీ పేజ్ గరిష్టంగా సంపదను కోల్పోయాడు. ఒక్క రోజులో 6.4 బిలియన్ అమెరికన్ డాలర్లు అతని సంపద కోల్పోయారు.

Follow Us:
Download App:
  • android
  • ios