గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ అక్సెంచర్‌  దాని ఉద్యోగుల్లో 5 శాతం మందిని తొలగించడానికి సిద్ధమైంది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వ్యాపారం మందగించిన నేపథ్యంలో ఈ చర్య తీసుకోనుంది.

కంపెనీ ఉద్యోగుల తొలగింపు  వేలాది మంది భారతీయులపై ప్రభావం చూపుతుందని ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూలో  పేర్కొంది. యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఉద్యోగులను ఉన్నారు. ఇందులో సుమారు 2 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు.

అయితే సాధారణంగా ఏటా పనితీరు ఆధారంగా తొలగింపులు ఉంటాయని, ఈసారి కూడా ఉద్యోగుల్లో పనితీరు ఆధారంగా 5 శాతం మందిని ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించింది. నివేదిక ప్రకారం ఆగస్టు నెలలో అసెంచర్ సీఈఓ ఇంటర్నల్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

also read 'నేను అప్పుడే హెచ్చ‌రించినా కాని ప‌ట్టించుకోలేదు': రాహుల్ గాంధీ ...

యాక్సెంచర్‌లో ప్రస్తుతం 120కి పైగా దేశాల్లో 5,13,000 మంది ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు. భారతదేశంలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగులున్న అతిపెద్ద కంపెనీ యాక్సెంచర్, ఈ చర్య వల్ల వేలాది మంది ఉద్యోగులు నష్టపోతారని తెలిసింది.

 "ప్రతి సంవత్సరం, మా కంపెనీ పనితీరు ప్రక్రియలో భాగంగా, మా ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో, అభివృద్ధి చెందవలసిన ప్రాంతాలు, వారి పురోగతి సామర్థ్యం  యాక్సెంచర్‌కు దీర్ఘకాలికంగా సరిపోతారా అనే దాని గురించి సంభాషణలు జరుపుతున్నాము" అని కంపెనీ  పేర్కొంది.

భారతదేశంలో మేము నియామకాలను కొనసాగిస్తాము, అలాగే  కొనసాగుతున్న కంపెన్సేషన్ కార్యక్రమాలలో భాగంగా బోనస్లు, ప్రమోషన్లకు ఇవ్వటానికి కూడా కొందరిని గుర్తించాము" అని యాక్సెంచర్ తెలిపింది. ఫిబ్రవరి చివరిలో ముగిసిన కంపెనీ రెండవ త్రైమాసికంలో 8 శాతం వృద్ధి చెందింది, అయితే కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ వృద్ధి 1.3 శాతానికి పడిపోయింది.