వొడాఫోన్ నుంచి సుమారు 11,000 మంది ఉద్యోగులకు లే ఆఫ్, భారత ఉద్యోగులకు మాత్రం ఊరట..
వొడాఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలలో కోతపెట్టారు. ఆశించిన ఆదాయం రాని నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
వోడాఫోన్ సీఈఓగా ఇటలీకి చెందిన మార్గెర్టీ డెల్లా వల్లే నియామకం జరిగిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా 11,000 ఉద్యోగాలను తగ్గించాలని వోడాఫోన్ యోచిస్తోంది . మార్గరీట్ డెల్లా వల్లే గత ఏప్రిల్‌లో సీఈఓగా నియమితులయ్యారు. కంపెనీ ఆదాయం భారీగా పతనం అయిన నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకునేందుకు వచ్చే మూడేళ్లలో 11 వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వోడాఫోన్‌లో దాదాపు 95,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో ఇప్పుడు 11,000 మంది సిబ్బందిని తొలగిస్తున్నారు. అంటే, సంస్థలో పది శాతం మందికి పైగా ఉద్యోగాలు కోల్పోనున్నారు.
వోడాఫోన్ కంపెనీకి అతిపెద్ద మార్కెట్ జర్మనీ. కానీ ఇటీవలి సంవత్సరాలలో కంపెనీ లాభాల్లో భారీ క్షీణత కనిపించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ మరిన్ని ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉంది. ఓ నివేదిక ప్రకారం, జర్మనీలో 1,300 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. కొన్ని నెలల క్రితం, ఇటలీలో వెయ్యి మందికి పైగా వోడాఫోన్ ఉద్యోగులను ఇంటికి పంపించారు. శుభవార్త ఏమిటంటే భారతదేశంలో వోడాఫోన్ ఐడియాలో ఉద్యోగాల కోతలు ఉండటం లేదు. Vodafone ఉద్యోగాల కోతలు యూరోపియన్ మార్కెట్‌కే పరిమితం కావచ్చు. కానీ మన దేశంలో కూడా కంపె పనితీరు బాగా లేదు. కొత్త CEO మార్గరీట్ డెల్లా వల్లే మాట్లాడుతూ...కస్టమర్లను సొంతం చేసేకునేందుకు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని. అన్ని దేశాల్లోనూ మార్కెట్ ను విస్తరించేందుకు ప్రయత్నిస్తామని కొత్త సీఈవో తెలిపారు.